అర్జున్ (నాగచైతన్య) చదువు పూర్తయ్యాక డ్రోన్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించే ప్రయత్నంలో ఉంటాడు. తల్లిదండ్రులు, సిస్టర్ తోపాటు అందమైన కుటుంబం అతనిది. తన ఇంటికి అతిథిగా వచ్చిన అంజలి అనే అమ్మాయితో ప్రేమలో పడితే, అందుకు అతని ఫ్యామిలీ కూడా ఓకే చెబుతుంది. ఇలా హ్యాపీగా గడిచిపోతున్న తన జీవితంలో తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోవటం పెను విషాదం నింపుతుంది. అయితే అది యాక్సిడెంట్ కాదని.. దాని వెనుక ఓ విలన్ ఉన్నాడని తెలుస్తుంది. ఇంతక వాళ్లను ఎందుకు చంపుతారు? అర్జున్ రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అన్నదే కథ.
విశ్లేషణ:
ఓ సామాన్యుడు కుటుంబం కోల్పోయి.. చంపిన వారిని పగతో ప్రతీకారం తీసుకుని.. చివరకు హీరోయిన్ తో సెటిల్ అయిపోయే కథ. గత ముప్పై ఏళ్లలో ఇలాంటి కథలు వందలు వచ్చాయి. అయితే ఇలాంటి పాత కథలను తీసుకున్నప్పటికీ ఇప్పటి జనరేషన్ కు తగ్గట్లు ఏదో చిత్రీకరించి ఉంటారని భావించిన వారికి నిరాశే ఎదురవుతుంది. పైగా ట్రైలర్, టీజర్ లో ఏదో ఎగ్జయిట్ మెంట్ అంశాలు ఉంటాయని భావించిన వారికి ‘యుద్ధం శరణం’నిస్సారం తెప్పిస్తుంది.
కథలో ఏమాత్రం కొత్తదనం లేదు.. పోనీ స్క్రీన్ ప్లేతో అయినా మ్యాజిక్ చేస్తారని ఆశిస్తే అది దక్కలేదు. సినమిాకు హైలెట్ గా చెప్పుకున్న శ్రీకాంత్ విలనిజం ఏమైనా పండిందా అంటే అది తుస్సుమనిపించింది. ఉన్నంతలో ఫస్టాఫ్ లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్; కొన్ని కామెడీ సీన్లు తప్ప సినిమాలో చెప్పుకోవటానికి ఏం లేదు. ఇంటర్వెల్ తర్వాత మొదలయ్యే కథలో పోనీ ట్విస్టులు ఏమైనా ఉన్నాయా? అంటే అదీ లేదు. ఐతే ‘యుద్ధం’ శరణం విజువల్ గా కొంచెం కొత్తగా అనిపిస్తుంది.
సెకంఢాఫ్ అయితే మరీ బోర్ కొట్టిస్తుంది. కొత్తగా చూపించిన డ్రోన్ క్యారెక్టరైజేషన్ కూడా పండలేదు. అసలు ఆ అంశాన్ని ఎక్కడ ఉపయోగించిన దాఖలాలు లేవు. మొత్తానికి ప్రేక్షకుల సహనానికి పరీఓ పెట్టే విధంగా యుద్ధం శరణం తయారయ్యింది.
నటీనటుల విషయానికొస్తే... నాగ చైతన్య మాస్ రోల్ లో ఆకట్టుకునేందుకు ట్రై చేసినా.. అది ఎక్కువగా ఆకట్టుకోలేదు. రొమాంటిక్ సన్నివేశాల వరకు బాగా చేసిన ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం తేలిపోయాడు. లావణ్యది జస్ట్ ఫస్టాఫ్ రొమాన్స్ కు పరిమితమైన పాత్రే. సినిమాకు హైలెట్ అవుతుందని భావించిన శ్రీకాంత్ విలనిజం బిల్డప్ కు మాత్రమే అంకితమైంది. మిగతా పాత్రలు ఫర్వాలేదు.
టెక్నికల్ నిపుణుల విషయానికొస్తే.. పెళ్లిచూపులు సంగీత దర్శకుడు వివేక్ సాగర్ పాటలు ఒకట్రెండు ఆహ్లాదంగా అనిపిస్తాయి. కానీ ఓవరాల్ గా అతడి మ్యూజిక్ ఈ సినిమాకు సూటవ్వలేదు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్. దానికి తోడు అసందర్భంగా వచ్చే పాటలు. నికేత్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమాల్లో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో అదొకటి. సినిమాకు ఒక డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడతను. కానీ, స్లో నారేషన్ సినిమాకు అది ఫ్లస్ కాలేకపోయింది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక ‘జెంటిల్ మన్’తో ఆకట్టుకున్న తమిళ రచయిత డేవిడ్ నాథన్.. ఈసారి ఆకట్టుకోలేకపోయాడు. అతడి కథ చాలా రొటీన్. అబ్బూరి రవితో కలిసి అతను రాసిన స్క్రీన్ ప్లేలో కూడా పెద్ద విశేషం ఏమీ లేదు. అబ్బూరి రవి మాటలు కూడా చాలా చోట్ల అసందర్భోచితంగా.. అనవసరంగా అనిపిస్తాయి.
ఫ్లస్ పాయింట్లు:
ఫస్టాఫ్
కెమెరా వర్క్
మైనస్ పాయింట్లు:
సెకండాఫ్,
స్క్రీన్ ప్లే
చివరగా.. స్క్రిప్టులోనే విశేషం ఏమీ లేకపోవడంతో అతను చేయడానికి పెద్దగా ఏమీ లేకపోయింది. దర్శకుడు కృష్ణ మారిముత్తు కొన్ని సన్నివేశాల వరకు ప్రతిభ చూపించినా వర్కవుట్ కాలేకపోయింది. కథను నడిపించిన విధానానికి ఏ వర్గ ప్రేక్షకుడూ సంతృప్తి చెందడు.
ఓవరాల్ గా యుద్ధం శరణం.. బిల్డప్ బాగా ఎక్కువైంది.