Hello Movie Review and Rating | హలో చిత్రం రివ్యూ.. మరో మనం మాత్రం కాలేకపోయింది

Teluguwishesh హలో హలో Hello Movie Review and Rating. Story and Cast Performances. Akhil , Priyadarshi starrer Directed by Vikram Kumar. Product #: 86176 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    హలో

  • బ్యానర్  :

    అన్నపూర్ణ స్టూడియోస్.. మనం బ్యానర్

  • దర్శకుడు  :

    విక్రమ్ కుమార్

  • నిర్మాత  :

    నాగార్జున అక్కినేని

  • సంగీతం  :

    అనూప్ రూబెన్స్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    పిఎస్ వినోద్

  • నటినటులు  :

    అక్కినేని అఖిల్ - కళ్యాణి ప్రియదర్శన్ - జగపతిబాబు - రమ్యకృష్ణ - అనీష్ కురువిల్లా - సత్యకృష్ణ - అజయ్ తదితరులు

Hello Movie Review

విడుదల తేది :

2017-12-22

Cinema Story

చిన్నతనంలో అనుకోకుండా కలుసుకున్న శ్రీను(అఖిల్), జున్ను(కళ్యాణి) మంచి స్నేహితులు అవుతారు. అయితే తర్వాత కొన్ని కారణాల వాళ్ళ విడిపోతారు. విడిపోయే టైం లో జున్ను తన ఫోన్ నెంబర్ ను శ్రీనుకి ఇస్తుంది. ఆమెనే తన సోల్ మేట్ గా భావించే శీను ఆమె కోసం యత్నిస్తుంటాడు. కానీ అటునుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు.. అలా పదిహేనేళ్ళు గడిచిపోతాయి.

అయితే సడెన్ గా ఓ రోజు తనకు ఓ అనుకోని కాల్ వస్తుంది.. అంతలోనే తన ఫోన్ చోరీ కి గురవుతుంది..ఆ అనుకోని కాల్ ఎవరిదీ, ఆ చోరీ అయినా ఫోన్ కోసం శ్రీను ఎం చేశాడు.. చివరికి తన సోల్ మేట్ ని ఎలా కలుసుకోగలిగాడు అన్నది హలో కథ..

cinima-reviews
హలో

మొదటి చిత్రం అఖిల్ తో నిరుత్సాహపరిచాడు అక్కినేని వారసుడు అఖిల్. దీంతో చాలా గ్యాప్ తీసుకుని రెండో చిత్రాన్ని పక్కాగా ఎంపిక చేశాడు నాగ్. అదే టాలెంటెడ్ దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం హలో. లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ..

ఈ సినిమా స్టోరీలైన్ చాల చిన్నది..కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాల అద్భుతం.. ఇక్కడే దర్శకుడి ప్రతిభ అర్థమవుతుంది.ఒక చిన్న స్టోరీలైన్‌కి ఇలాంటి స్ర్కీన్‌ప్లే రాసుకోవచ్చా? అని సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయేలా చేశాడు విక్రమ్.అఖిల్‌కి ఫోన్ కాల్ వచ్చినప్పటి నుంచి మరో స్థాయికి స్టోరీ మలుపు తీసుకుంటుంది. అక్కడి నుంచి ప్రతి సీన్ ఇంట్రెస్ట్ పెంచుకుంటూ పోతుంది. తర్వాత ఏం జరిగింది? అసలా ఆ ట్విస్ట్ ఎలా వచ్చింది? అసలేం జరగబోతోంది? అనే ఉత్కంఠతో స్టోరీని నడిపించాడు విక్రమ్. అయితే ఈ క్రమంలోనే స్టోరీ సాగతీత కాస్త చికాకు కలిగిస్తుంది.

యాక్టర్ల నుంచి క్లాస్ ఫెర్ ఫార్మెన్స్ రాబట్టే విక్రమ్ ఎందుకనో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈసారి కాస్త అతి శ్రద్ధ కనబరిచాడు. దీంతో హీరో ఎంట్రీ కోసం దాదాపు 40 నిమిషాల దాకా ప్రేక్షకుడు ఎదురు చూడాల్సి వస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ లో దృష్టిసారించినప్పటికీ.. నటనలో మాత్రం అఖిల్ మెచ్యూర్డ్ పెర్ ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఈ విషయంలో తొలిచిత్రమే అయినా కళ్యాణి అద్భుతమైన నటన అందించింది. ఎమోషనల్ విషయాల్లో పెద్ద పీట వేసిన దర్శకుడు ఒక రకంగా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టాడనే చెప్పొచ్చు.

నటీనటుల విషయానికొస్తే..

అఖిల్ ఈ సినిమాకి ప్రాణం పోశాడు. అతని కష్టం వెండితెరపై స్పష్టంగా కనిపిస్తోంది. రొమాన్స్, డ్యాన్స్, యాక్షన్.. ఇలా అన్నింటిలోనూ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషన్స్ విషయంలోనే నటనలో ఇంకాస్త పరిణితి చెందాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. కళ్యాణి ప్రియదర్శన్‌ తన తొలి సినిమాలోనే అద్భుత అభినయం కనబరిచింది. అఖిల్‌కి సరితగ్గ జోడీలా అనిపించింది. రమ్యకృష్ణ, జగపతిబాబులు తమతమ పాత్రలకి మంచి న్యాయం చేశారు. ఇక విలన్ పాత్రలో అజయ్ మరోసారి చెలరేగి పోయాడు. మిగతా వారు ఫర్వాలేదు.

సాంకేతిక విభాగం..

అనూప్ రూబెన్స్ సంగీతం కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్. అయితే పాటల కన్నా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోనే ఎక్కువ ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లు నిజంగానే హాలీవుడ్‌ని తలపించే విధంగా ఉన్నాయి. విక్రమ్ వాటిని స్ర్కీన్‌పై ప్రెజెంట్ చేసిన విధానం సగటు ప్రేక్షకుడ్ని మైమరిపించేస్తాయి. ఎడిటింగ్ జస్ట్ ఓకే. నాగార్జున నిర్మాణ విలువలు అదిరిపోయాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ
డైరెక్షన్
స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్ :
సాగతీత

తీర్పు..
ఒక మాములు ప్రేమకథను అందమైన ప్యాక్ లో చేసి ప్రేక్షకుల మీదకు వదలాడు దర్శకుడు విక్రమ్ కుమార్. హలో టెక్నికల్ బ్రిలియన్స్ అనిపించే ఓ మాములు ప్రేమకథ. అయితే తన గత చిత్రాల మాదిరిగా మ్యాజిక్ మాత్రం క్రియేట్ చేయలేకపోయాడు. విక్రమ్ నుంచి ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఆశిస్తారనడంలో సందేహం లేదు.

చివరగా... హలో.. బాగుంది.. కానీ, మరో మనం మాత్రం కాదు.