Chitralahari Movie Review ‘చిత్రలహరి’ మూవీ రివ్యూ

Teluguwishesh చిత్రలహరి చిత్రలహరి Get information about Chitralahari Telugu Movie Review, Sai Tej Chitralahari Movie Review, Chitralahari Movie Review and Rating, Chitralahari Review, Chitralahari Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 90200 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘చిత్రలహరి’

  • బ్యానర్  :

    మైత్రి మూవీ మేకర్స్

  • దర్శకుడు  :

    కిషోర్ తిరుమల

  • నిర్మాత  :

    నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, చెరుకూరి మోహన్‌ (సీవీఎమ్‌)

  • సంగీతం  :

    దేవిశ్రీ ప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    కార్తిక్ ఘట్టమనేని

  • ఎడిటర్  :

    శ్రీకర్ ప్రసాద్

  • నటినటులు  :

    సాయి ధరమ్‌ తేజ్‌, కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌, సునీల్‌, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌ తదితరులు

Chitralahari Movie Review Rating Story Cast And Crew

విడుదల తేది :

2019-04-12

Cinema Story

‘హీరోకి ఒక లక్ష్యం ఉంటుంది. కానీ, ఆ లక్ష్యం కోసం ఎంత ప్రయత్నించినా ఫెయిల్యూరే. ఎక్కడికి వెళ్లినా అవమానమే. అలాంటి సమయంలో తనలో స్ఫూర్తిని నింపే సంఘటనలు. చివరికి విజయం’. ఈ కోవకు చెందిన సినిమానే ‘చిత్రలహరి’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఈ సినిమా కథేంటి, ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం.

విజయ్ (సాయి తేజ్) ఇంజినీరింగ్ పూర్తిచేసి సొంతంగా ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంటాడు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చావుబతుకుల మధ్య ఉన్నవారికి కాపాడటం కోసం ఓ డివైజ్‌ను తయారుచేయడమే ఈ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టును పట్టుకుని స్పాన్సర్‌షిప్ కోసం కంపెనీల చుట్టూ తిరుగుతుంటాడు. కానీ, ఎక్కడికి వెళ్లినా అది వేస్ట్ అంటూ కొట్టిపారేస్తూ ఉంటారు.

చిన్నప్పటి నుంచి తానొక లూజర్‌ని అనుకుంటూ బతికే విజయ్‌ జీవితంలో ఒక గెలుపు లహరి (కళ్యాణి) ప్రేమ. తొలి చూపులోనే లహరిని ఇష్టపడిన విజయ్ ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. అయితే స్వేచ్ఛ (నివేథ పేతురాజ్) మాటలు విని విజయ్‌ను లహరి దూరం చేసుకుంటుంది. ఇటు తన ప్రాజెక్టు ఫెయిల్ అయి, అటు ప్రేయసి దూరమై బాధలో కూరుకుపోయిన విజయ్.. తాను గెలవడానికి ఏం చేశాడు అనేదే సినిమా.

cinima-reviews
చిత్రలహరి

విశ్లేషణ

టైటిల్స్ వెనకాల వచ్చే 90ల్లోని మధురమైన పాటలతో సినిమా మొదలవుతుంది. రకరకాల పాటల కలయికతో కూడిన కార్యక్రమం ఆ ‘చిత్రలహరి’ అయితే.. విభిన్నమైన పాత్రల కలయికతో కూడిన సినిమా ఈ ‘చిత్రలహరి’ అని సినిమా ప్రారంభంలోనే క్లారిటీ ఇచ్చేశారు. కానీ, టైటిల్స్ పడుతుంటే ఉన్న ఫీల్ సినిమా అయిపోయేటప్పటికి ప్రేక్షకుడిలో ఉండదు. ఎందుకంటే ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుడి హృదయాన్ని అంత గొప్పగా హత్తుకోదు. చాలా సాదాసీదాగా సాగిపోతుంది.

ప్రథమార్థంలో లవ్, కామెడీ, ఎమోషన్‌ను సమపాళ్లలో కలిపి వడ్డించిన దర్శకుడు కిశోర్ తిరుమల.. సెకండాఫ్‌ను మాత్రం చాలా సింపుల్‌గా ఎత్తేశారు. కథ కొత్తదేమీ కాదు. కానీ.. అందులోని పాత్రలు, వాటి స్వభావం ప్రేక్షకుడికి కొత్తగా అనిపిస్తాయి. సాయి తేజ్‌‌లో ఇప్పటి వరకు చూడని లుక్‌, ఆ లుక్‌కు ఒక కారణం జతచేస్తూ దర్శకుడు చూపించిన విధానం బాగుంది. ఫస్టాఫ్‌లో హీరోహీరోయిన్ల మధ్య లవ్ ఎపిసోడ్‌ను దర్శకుడు బాగానే చూపించారు.

హారర్ సినిమా చూస్తూ భయంభయంగా లవ్‌ను ప్రపోజ్ చేయడం బహుశా ఇప్పటి వరకు ప్రేక్షకులు చూసుండరు. ఇక సునీల్, సాయి తేజ్ కాంబినేషన్ అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత సునీల్ మెప్పించారు. ఫస్టాఫ్‌ను చాలా సరదాగా, ఎమోషనల్ టచ్‌తో నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌ను మాత్రం అంతేబాగా తెరకెక్కించలేకపోయారు. సెకండాఫ్‌లో ఎమోషన్స్ డోస్ కాస్త పెంచారు. కొన్ని సన్నివేశాలు కచ్చితంగా కంటతడి పెట్టిస్తాయి. ఈ ఎమోషన్స్ మధ్య వెన్నెల కిషోర్ కామెడీ కాస్త ఊరట. తమిళం, ఇంగ్లిష్‌ను మిక్స్ చేసి వెన్నెల కిషోర్ కొట్టిన కామెడీ నవ్వుల పువ్వులు పూయిస్తుంది.

నటీనటుల విషాయానికి వస్తే..

సాయి తేజ్ నటన చాలా బాగుంది. ఆయనలో ఎంతో పరిణితి వచ్చింది. గుబురు గడ్డం, కాస్త ఒళ్లుచేసి చాలా బాగా నటించారు సాయితేజ్. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన.. ఇలాంటి ఘటనలను ఎదుర్కోన్న ప్రతీ యువకుడి చేత కళ్లు చమర్చేలా చేస్తోంది. ఇక, ఏ నిర్ణయం కోసమైనా ఎదుటి వ్యక్తులపై ఆధారపడే స్వభావం కలిగిన అమ్మాయి పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ బాగానే నటించింది. తేజూ, కళ్యాణి జంట తెరపై చూడముచ్చటగా ఉంది.

మరోవైపు, ప్రతి విషయంలోనూ నెగిటివ్‌ను వెతికే అమ్మాయి పాత్రలో నివేథ పేతురాజ్ నటన బాగుంది. కార్పోరేట్ ఉద్యోగిణిగా ఆమె లుక్ బాగుంది. ఇక, సినిమాకు మరో బలం పోసాని క్రిష్ణమురళి పాత్ర. సాయి తేజ్ తండ్రిగా అద్భుతంగా నటించారాయన. సునీల్, వెన్నెల కిషోర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ ఇద్దరితో కామెడిని ఫుల్ మార్క్స్ పడ్డాయి.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతిక పరంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ గత చిత్రాల మాదిరిగానే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కార్తిక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం సినిమాకు అదనపు బలంగా నిలించింది. హీరో సాయిధరమ్ తేజ్ ను చూపించిన తీరు, తెరకెక్కించిన విధానం అకట్టుకుంటాయి. పాటల చిత్రీకరణ, సముద్రంలో పడవ ఎపిసోడ్‌లో ఆయన పనితనం కనిపించింది. అయితే ద్వీతీయార్థంలో ప్రీ క్లైమాక్స్ కు ముందు సినిమా నిడివి కాసింత ఎక్కవగా వుంటే బాగుండేదని అనిపిస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ఎప్పటిలానే బాగుంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకు బాగానే పనిచెప్పారు. సినిమా నిడివిని తగ్గించి ప్రేక్షకులు విసుగు చెందకుండా చేశారు. అయితే సినిమా చాలా సింపుల్ గా ముగిసిందే అన్న భావన మాత్రం ప్రేక్షకులకు కలుగుతుంది. సినిమాలో డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి. చాలా సింపుల్‌గా గుచ్చుకున్నట్టు ఉన్నాయి. ‘కలలు కనే ప్రతి వాడూ కలాం కాలేడు’, ‘స్విగ్గీలో పెట్టిన ఆర్డరా క్రిష్ణారావు ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి, సక్సె్స్ టైం పడుతుంది’ లాంటి డైలాగులు బాగా పేలాయి.

తీర్పు..

ఓ యువకుడి జీవితంలో విజయం దోబుచులాడిన విధానం.. స్పూర్తిని కలించిన ఘటనలు, అదే సమయంలో కీడు ఎంచి మేలు తలచు అన్ని సూక్తి నేపథ్యంలో సాగే భావోద్వేగాల చిత్రం..

చివరగా... లూజర్ కాన్సెప్ట్ తో సక్సెస్ సాధించిన సాయి ధరమ్ తేజ్..!

 

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh