Darbar Movie Review ‘దర్బార్’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘దర్బార్’ ‘దర్బార్’ Get information about Darbar Telugu Movie Review, Rajinikanth Darbar Movie Review, Darbar Movie Review and Rating, Darbar Review, Darbar Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 92104 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘దర్బార్’

  • బ్యానర్  :

    లైకా ప్రొడ‌క్ష‌న్స్‌

  • దర్శకుడు  :

    ఎఆర్ మురుగదాస్

  • నిర్మాత  :

    సుభాస్కరన్

  • సంగీతం  :

    అనిరుధ్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    స‌ంతోష్ శివ‌న్‌

  • ఎడిటర్  :

    శ్రీకర్ ప్రసాద్

  • నటినటులు  :

    రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి, తంబి రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా, యోగిబాబు, ద‌లీప్ తాహిల్‌, శ్రీమాన్ తదితరులు

Darbar Movie Review Rating Story Cast And Crew

విడుదల తేది :

2020-01-09

Cinema Story

రజనీకాంత్.. దక్షిణాధి సూపర్ స్టార్.. అని దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సోంతం చేసుకున్న పేరది. ఈ పేరుకు ఉన్న క్రేజ్ చాలు ఆయన చిత్రాలను హిట్ చేస్తాయి. అయితే ఈ మధ్యకాలంతో ఆయన స్థాయికి తగ్గ చిత్రాలు విడుదల కాలేదన్నది ఓపెన్ టాక్. అయితే ఈ వెలితిని భర్తీ చేయడానికే వచ్చాడో స్టార్ డైరెక్టర్ ఎఆర్ మురగదాస్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్బార్ ఎలా వుందన్న విషయంలోకి వెళ్లే ముందు చిత్ర కథ ఏంటని తెలుసుకుందాం..

ముంబై క‌మిష‌న‌ర్ ఆదిత్య అరుణాచ‌లం(ర‌జినీకాంత్‌), గ్యాంగ్‌స్ట‌ర్స్ ను ఎన్‌కౌంట‌ర్ చేస్తూ.. ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పోలీసు అధికారిగా పేరొందుతాడు. దాంతో ముంబైలోని దాదాలంద‌రూ భ‌య‌ప‌డిపోతుంటారు. మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్ ను కూడా ఆదిత్య అరుణాచ‌లం లెక్క చేయ‌డు. అక్క‌డ నుండి క‌థ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ నుండి ముంబైకి స్పెష‌ల్ ఆర్డ‌ర్ మీద ఆదిత్య ముంబై వ‌స్తాడు. హ‌రి చోప్రా(సునీల్ శెట్టి) కార‌ణంగా ముంబై పోలీసుల‌ను ఎవ‌రూ లెక్క‌చేయ‌రు. ప్ర‌జ‌ల్లో పోలీసులంటే భ‌యం ఉండ‌దు. ఆ స‌మ‌యంలో ముంబైలో అడుగు పెట్టిన ఆదిత్య‌కు డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ కుమార్తె కిడ్నాప్ గురించి తెలుస్తుంది.

ఆమెను క‌నిపెడుతూనే ముంబైలోని డ్ర‌గ్స్, హ్యుమ‌న్ ట్రాఫికింగ్ స‌మ‌స్య‌ను నిర్మూలిస్తాడు. దాంతో ప్ర‌జ‌ల‌కు మ‌ళ్లీ పోలీసులంటే న‌మ్మ‌కం పెరుగుతుంది. అదే స‌మ‌యంలో వినోద్ మల్హోత్రా(న‌వాబ్ షా) కొడుకు అజ‌య్ మ‌ల్హోత్రా(ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌) కార‌ణంగానే ముంబైలోడ‌గ్స్ రాకెట్ డెవ‌ల‌ప్ అయ్యింద‌ని తెలుస్తుంది. దీంతో అత‌న్ని అరెస్ట్ చేసి శిక్ష ప‌డేలా చేస్తాడు. దాంతో అత‌న్ని త‌ప్పించ‌డానికి వినోద్ మ‌ల్హోత్రా ఓ ప్లాన్ వేస్తాడు. అయితే ఆ ప్లాన్‌ని ఆదిత్య క‌నిపెట్టేస్తాడు. ఇంతకు వినోద్ మ‌ల్హోత్రా వేసే ప్లాన్ ఏంటి? దానికి ఆదిత్య ఏం చేస్తాడు? అజ‌య్‌కి హ‌రి చోప్రాకు ఉన్న లింకేంటి? ర‌జ‌నీ జీవితంలోకి వ‌చ్చిన లిల్లీ (న‌య‌న‌తార) క‌థేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

cinima-reviews
‘దర్బార్’

విశ్లేషణ

ర‌జినీకాంత్ అభిమానులు కోరుకుంటున్నట్లు ఓ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రాన్ని చేయాలని నిర్ణ‌యించుకుని స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్‌తో క‌లిసి చేసిన సినిమాయే ద‌ర్బార్‌. రజనీ వంటి స్టార్ తో సినిమాను రూపోందిస్తున్న క్రమంలో మురుగ‌దాస్ చిత్ర కథపై చాలా శ్ర‌ద్ధ పెట్టాడు. అప్పుడెప్పుడో ప‌క్కా పోలీస్ క్యారెక్ట‌ర్‌లో అల‌రించిన ర‌జినీకాంత్ చాలా కాలం త‌ర్వాత చేసిన పోలీస్ ఆఫీస‌ర్ సినిమా ఇది. ఆయ‌న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మురుగ‌దాస్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో ద‌ర్బార్ సినిమాను తెర‌కెక్కించారు.

అయితే కథలో కొత్తదనం మిస్ అయ్యింది. చాలా సినిమాల్లో ఇలాంటి కథతో వుందన్నది కాదనలేని వాస్తవం. అయితే ఇలాంటి కథతో సినిమాను రూపోందించేందుకు నిర్మాతలు ముందుకు రావడం సాహసమేనని హీరో ర‌జినీకాంత్ చెప్పడం నూటికి నూరుపాళ్లు నిజమే. నిర్మాతలదే కాదు హీరో రజనీకాంత్ కూడా నిజంగానే సాహసం చేశారు. మురగదాస్ పైనున్న నమ్మకం.. కథనంలో కొత్తదనంపై పూర్తి విశ్వాసంతో ముందుకెళ్లారు రజని. ప్రథ‌మార్ధంలో రెండు మూడు చోట్ల ఇంటెలిజెన్స్ స్క్రీన్ ప్లేని వాడుకున్నాడు ద‌ర్శకుడు మురుగదాస్‌‌.

ఇంటెలిజెన్స్ స్క్రీన్ ప్లే స‌న్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలిచాయి. తెలివిగా విదేశాలకి పారిపోయిన అజ‌య్ మ‌ల్హోత్రాని అంతే తెలివిగా దేశానికి ర‌ప్పించడం, అత‌న్ని జైల్లోనే మ‌ట్టుబెట్టడం నేప‌థ్యంలో వ‌చ్చే విరామ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ద్వితీయార్థంలో మాత్రం ఆ జోరు క‌నిపించ‌దు. తండ్రీకూతుళ్ల మ‌ధ్య సెంటిమెంట్‌పైనే దర్శకుడు దృష్టిపెట్టాడు. అవి కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా అనిపించిన‌ప్పటికీ, క‌థ క‌థ‌నాల ప‌రంగా మాత్రం చిత్రం నెమ్మదిగా మారిపోయింది. న‌య‌న‌తారతో స‌న్నివేశాల నుంచి వినోదం పుట్టించే ప్రయ‌త్నం చేశారు. ర‌జ‌నీ స్టైల్‌, ఆయ‌న జోష్ ఈ సినిమాకి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలిచింది.

నటీనటుల విషాయానికి వస్తే..

మొత్తంగా రజనీకాంత్ సోలో పెర్ఫామెన్స్ కూడివుంది. అభిమానులు కోరుకున్నట్లుగా సినిమాలో అంతా తానై క‌నిపించాడు. నవయవ్వన యువకుడిలా హుషారుగా కనిపించాడు రజనీ. అటు ఫైట్స్, ఇటు డ్యాన్సుల్లోనూ రజనీ తన మార్కు చూపించాడు. తన అభిమానులు గత కొన్ని చిత్రాల నుంచి కోరుకుంటున్న తన హీరోయిజం కోణాన్ని చూపాడు. కూతురు నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లోనూ రజనీకాంత్ చక్కని సెంటిమెంట్ పండించారు. నివేదా థామస్ అభినయం కూడా చిత్రానికి ఎంతగానో దోహదపడింది. హీరోయిన్ గా చేసిన న‌య‌న‌తార‌ పాత్ర చిన్నదే. అమె మాత్రం తనకు కేటాయించిన పాత్రలో పూర్తి న్యాయం చేసింది.

ద్వితీయార్థం అంతా మెయిన్ విల‌న్ సునీల్ శెట్టి, హీరో ర‌జినీకాంత్ మ‌ధ్య‌నే ఎక్కువ భాగం సాగుతుంది. పేరుకు పెద్ద డాన్ కానీ ఆ ప్రభావం కొన్ని సన్నివేశాలకే పరిమితం అవుతుంది. మిగతా సన్నివేశాల్లో ఆయన గాంభీర్యం కనిపించదు. యోగిబాబు రజనీకాంత్ తో కనిపిస్తూ నవ్వించాడు. ప్ర‌తీక్ బబ్బ‌ర్‌, న‌వాజ్‌షా కూడా ఉన్నంత‌లో కామెడీతో న‌వ్వించే ప్రయ‌త్నం చేశాడు. ర‌జినీ ల‌వ్ ట్రాక్‌కు ఓ రీజ‌న్ పెట్టి దాన్ని ర‌న్ చేయ‌డంతో మ‌న‌కు ఓకే అనిపిస్తుంది. టోట‌ల్ క‌థ ప‌రంగా చూస్తే ఇదొక రివేంజ్ డ్రామా. అస‌లు ఆ ప్ర‌తీకారం ఎవ‌రు ఎవ‌రి మీద‌, ఎందుకు తీర్చుకున్నార‌నేది వెండితెరపై తెలుసుకోవాల్సిందే.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంతోష్ శివ‌న్ కెమెరా ప‌నిత‌నం చక్కగా వుంది. మాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునే స్టైల్లో రామ్‌ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్ మాస్ అడియన్స్ ను ఆకట్టుకునేలా వున్నాయి. ను డిజైన్ చేశారు. ర‌జినీకాంత్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ సింప్లీ సూప‌ర్బ్‌. అనిరుధ్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలుస్తాయి. ముఖ్యంగా నేప‌థ్యం సంగీతం, దుమ్ము ధూళి పాట‌తో అనిరుధ్ చిత్రాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు. మాస్ సీన్స్ వ‌చ్చే స‌మ‌యంలో బ్యాక్‌గ్రౌండ్ వ‌చ్చే తలైవా అనే సౌండ్ అభిమానుల‌కు ఇంపుగా ఉంటుందన‌డంలో సందేహం లేదు.

ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌, ఆయన స్టైల్ పైనే ఎక్కువ‌గా ఆధార‌పడ్డాడు మురుగ‌దాస్‌. తన మార్కుగా పేరున్న కొన్ని మైండ్‌గేమ్ స‌న్నివేశాల్ని మాత్రం ఇందులో బాగా చూపించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కు కూడా మార్కులు బాగానే పడ్డాయి. అనిరుధ్ పాట‌లు తెలుగు ఆడియెన్స్‌కు పెద్ద‌గా క‌నెక్ట్ కాకపోయినా మ్యూజిక్ విషయంలో.. మాత్రం అడియన్స్ కనెక్ట్ అవుతారు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. మొత్తంగా అభిమానులు రజనీకాంత్ ను ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా చూపించే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది.

తీర్పు..

రజనీ అభిమానులు చాలా కాలంగా వేచిచూస్తున్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్.. ‘దర్బార్’

చివరగా.. అభిమానులకు పండగ ‘దర్బార్‘.!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh