(Image source from: power star pawan kalyan medak mp elections campaign)
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ గతకొన్ని రోజులనుంచి మీడియాకంట పడటం లేదు. అంతేకాదు.. ఆయన తన సినిమా విశేషాలు గురించి చెప్పుకోవడంగానీ... రాజకీయ నాయకులతో మంతనాలు జరపడంగానీ ఏమీ చేయడం లేదు. అంటే.. కేవలం తెరమీదే కాదు.. తెరవెనుక కూడా పవన్ కల్యాణ్ ఎవ్వరికీ కనిపించడం లేదు... ఎవ్వరితో మాట్లాడటం లేదు. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ తరఫు నుంచి ప్రచారాలు జోరుగా కొనసాగించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు అదే పార్టీలో తన సన్నిహిత మిత్రుడు మెదక్ ఉపఎన్నికల బరిలో వుండగా అతనికోసం ప్రచారానికి మాత్రం రాలేదు. మొత్తంగా గతకొన్నిరోజుల నుంచి పవన్ ప్రస్తావన కేవలం వార్తల్లోనే తిరుగుతోంది కానీ.. ఆయన మాత్రం ప్రత్యక్షంగా కనిపించిన దాఖలాలు అయితే లేనేలేవు. దీంతో ఇది చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది.
పవన్ కల్యాణ్ తన కొత్త జనసేన పార్టీని ఆవిర్భవించిన నేపథ్యంలో జగ్గారెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించిన పవన్.. ఈమధ్య కాలంలో అతనికి చాలాదూరంగానే వున్నాడని రాజకీయవర్గాలు తెలుపుతున్నాయి. ఫోన్ సంభాషణలు కూడా అంతగా లేవని సన్నిహితవర్గాలు తెలుపుతున్నాయి. అయితే పవన్ సర్జరీ చేయించుకోవడం వల్లే ఎవరికీ అందుబాటులో లేరని.. అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రచారానికి రాలేకపోయారని సమాచారం! కానీ ప్రత్యర్థులు మాత్రం ఇదే అదునుగా భావించి ఆయనపై రకరకాలుగా విమర్శలు కురిపించారు. టీఆర్ఎస్ పార్టీ హవా ఎక్కువగా వున్న నేపథ్యంలో పవన్ భయపడ్డాడనని... అందుకే ఆయన మెదక్ ప్రచారానికి రాలేకపోయాడని ఆరోపణలు గుప్పించారు. కానీ ఈ వ్యాఖ్యానాలను బీజేపీ పార్టీ నాయకులు కొట్టిపారేశారు. పవన్ సర్జరీ కోసం బెంగుళూరులో వుండాల్సి వచ్చింది కాబట్టి ఆయన ప్రచారానికి రావడం కుదరలేదని చెబుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీతోపాటు టీఆర్ఎస్ పార్టీని తన మాటలతూటాలతో ఆ పార్టీలను తుడిచేసి బీజేపీకి మద్దతుగా పలికిన పవన్ కల్యాణ్... ఈసారి మెదక్ ఉపఎన్నికల బరిలో వున్న తన ప్రియమిత్రుడు జగ్గారెడ్డి కోసం ఎందుకు ప్రచారం చేయడం లేదో ఇంతవరకు అర్థంకాని ప్రశ్నగానే మిగిలిపోయింది. జగ్గారెడ్డిని బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించిన క్రమంలో పవన్ మెదక్ ఉపఎన్నికల ప్రచారానికి వస్తారని భావించిన ఓటర్లందరికీ అడియాశలే మిగిలినట్లు తెలుస్తోంది. పైగా బీజేపీ పార్టీ కూడా ఈయన మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది. కానీ పవన్ వారి నమ్మకాలను వొమ్ము చేసేశారు. ఈ విషయంవారు బహిరంగంగా ప్రకటించకపోయినా.. లోలోపలా మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఆయన మెదక్ ఉపఎన్నికలను ఎందుకు సీరియస్ గా తీసుకోలేదోనన్న కారణాన్ని విశ్లేషకులు కూడా ఊహించుకోలేకపోతున్నారు.
ఇదిలావుండగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా అన్నివైపులా బాగానే వీస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలలో కూడా టీఆర్ఎస్ బలోపేతాన్ని సాధించింది. అలాగే మెదక్ లో వరుసగా మూడుసార్లు విజయం సాధించి అక్కడ తన ప్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పవన్ బీజేపీ తరఫున మెదక్ ప్రచారానికి వస్తే ఆయనపై రాళ్లదాడి చేస్తామని జేఏసీ సభ్యులు హెచ్చరికలు జారీ చేశారు. అంటే.. మెదక్ జిల్లా నుంచి పవన్ వ్యతిరేక పవనాలు చాలానే వీచాయి. దీంతో పవన్ కల్యాణ్ మెదక్ ఉపఎన్నికల ప్రచారానికి దూరంగా వున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ పవన్ ఈ ప్రచారాంలో పాల్గొని వుంటే.. రాజకీయ పరిమాణంలో చాలా మార్పులు వచ్చేవని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ ఈ ప్రచారానికి రాకపోవడం ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.
మరోవైపు.. ఈయన తాజాచిత్రం ‘‘గోపాల గోపాల’’ షూటింగ్ కూడా పవన్ వల్లే ఆలస్యం అవుతుందని ఆ మూవీ యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. అయితే షూటింగ్ కు పవన్ వెళుతున్నారా..? లేదా..? అన్న విషయం కూడా క్లారిటీ లేదు. అందుకే.. గతంలో విడుదల చేయాల్సిన ఫస్ట్ లుక్ పోస్టర్లని, టీజర్ ని వాయిదా మీద వాయిదాలు వేసుకుంటూపోతున్నారని సమాచారం! దీంతో పవన్ కల్యాన్ ‘‘కనిపించుట లేదు’’ అంటూ మీడియా కథనాలు రావడం మొదలయ్యాయి.
AS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more