శ్వేత బసు ప్రసాద్. సినిమాల ఆఫర్లు లేక.., డబ్బుల కోసం పడుపువృత్లిలోకి దిగిన నవతరం నటి. గతంలో ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోవటంతో పాటు.. తాజాగా రెండు వారాల క్రితం పోలిసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ విషయం తెలుగు ప్రజలతో పాటు, దేశంలోని అన్ని ఫిలిం ఇండస్ర్టీ వర్గాలకు తెలుసు. అయితే ఇక్కడ బలి అయిన అమ్మాయి గురించి అంతా ప్రశ్నిస్తున్నారు కాని.. ఆమెను ఉపయోగించుకున్న వ్యక్తి గురించి మాత్రం చిన్న క్లూ కూడా బయటకు రానివ్వటం లేదు. శ్వేత మొదటగా దొరికిపోయిన ఆపరేషన్ సమాచారం బట్టి చూస్తే.., ఆమె దగ్గరకు వెళ్లేది బాగా డబ్బున్న వ్యక్తులే అని ఖచ్చితంగా తెలుస్తోంది.
రెండు వారాల క్రితం శ్వేత బసు వ్యభిచారం చేస్తోందంటూ పోలిసులు అరెస్టు చేసారు. కోర్టు ఆమెను 15రోజుల పాటు రెస్క్యూ హోంలో ఉంచాలని ఆదేశించింది. అయితే శ్వేత అరెస్టు వివరాలను మీడియాకు చెప్తున్న పోలిసులు., బడా బాబు గురించి మాత్రం ఏ మాత్రం సమాచారం ఇవ్వటం లేదు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే, ఆ వ్యక్తి ఏమయినట్లు? ఒకవేళ పోలిసులు వెళ్లే సమయంలో వ్యక్తి లేకపోతే.., ఆమె తప్పుడు పని చేస్తోందని ఎలా నిర్ధారించగలరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే.., బుక్ అయిన వ్యక్తి ఎవరో పోలిసులకు తెలుసు కాని బయటకు రానివ్వటం లేదని అందరికి అర్ధం అవుతోంది.
డబ్బులు లేక తప్పు చేసిన అమ్మాయిని అరెస్టు చేశారు కానీ.., డబ్బులు ఎక్కువయి, ఏం చేయాలో తెలియక ఇలా తప్పుడు పనులకు అలావాటు పడ్డ వ్యక్తిని కనీసం స్టేషన్ కు కూడా తీసుకురాలేదు. దీనిపై ఎంత ప్రశ్నించినా పోలిసులు సమాధానం చెప్పటం లేదు ఎందుకని. బాధితురాలిని విచారిస్తే ఆమె ఖచ్చితంగా అతడి గురించి తెలిసిన వివరాలు చెప్తుంది. అలా అయినా పోలిసులు పట్టుకుని ఉండవచ్చు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాని వారికి ఆయనెవరో తెలియకుంటే కదా ప్రశ్నించటం.. పట్టుకోవటం. నిజంగా అరెస్టు చేయాలి అనుకుంటే ఇంతలా వివాదం జరిగేది కాదు. ఇంత జరిగినా పెద్ద మనిషి పేరు బయటకు రానివ్వటం లేదు అదే మన పోలిసుల గొప్పతనం
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more