టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ మద్య కాస్త ఎక్కువగా భయం పట్టుకుంది. ఏ విషయంలో అయినా ఎవరిని నమ్మటం లేదు. మరో చాన్స్ తీసుకుంటే పోలా అనుకుంటున్నాడు. ముఖ్యంగా డైరెక్టర్లు అంటే మహేష్ అస్సలు నమ్మటం లేదు. ఫస్ట్ చాయిస్ కంటే నెక్స్ట్ చాయిస్ బెస్ట్ అనుకుంటున్నాడు. ‘ఆగడు’ దెబ్బతో ఇలా అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.., తాజాగా మహేష్ ఓ డైరెక్టర్ ను అవమానించాడు. షూటింగ్ అంతా అయిపోయాక నువ్వు వద్దు అంటూ మరో డైరెక్టర్ ను పట్టుకొచ్చి ఆయనతో రీ షూట్ చేయించారు.
ఓ సినిమాల్లో నటిస్తూనే, బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటనల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న మహేష్ బాబు తాజాగా ‘రెయిన్ బో చిల్ర్డన్ హాస్పిటల్’ యాడ్ లో నటించాడట. ఈ ప్రకటనను ఓ డైరెక్టర్ చే షూట్ చేయించారు. షూటింగ్ లో పాల్గొన్న మహేష్.., పని పూర్తయి ప్యాకప్ చెప్పాక, యాడ్ బాగా రాలేదు అన్నాడట. డైరెక్టర్ చెప్పిన కాన్సెప్ట్ బాలేదని చెప్పాడు. అంతేకాదు త్రివిక్రమ్ ను రప్పించి, భయ్యా ఈ యాడ్ డైరెక్ట్ చేసిపెట్టమన్నాడట. గతంలో పలు ప్రకటనలు చేసిన అనుభవంతో పాటు, మహేష్ కమర్షియల్ పవర్ తెలిసిన త్రివిక్రమ్ బన్నీ షూటింగ్ నుంచి కాసేపు బయటకు వచ్చి మహేష్ యాడ్ చేసి పెట్టాడట.
మొదట చేసిన కాన్సెప్ట్ కంటే ఈ కాన్సెప్ట్ బాగుందని మహేష్ మెచ్చుకోవటంతో హాస్పిటల్ వర్గాలు కూడా ఊపిరిపీల్చుకున్నాయి. అయితే తన పొట్టకొట్టడాన్ని మొదటి డైరెక్టర్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తి కళ, టాలెంట్ ను తొక్కేసి మరొకర్ని పైకి తీసుకురావటం ఏంటని విమర్శలు వస్తున్నాయి. సినిమాల్లో అంటే డైరెక్టర్ ఎంపికలో మహేష్ వేలు పెడతే బాగుంటుంది కాని.., యాడ్ ల విషయంలో కూడా ఇలా చేస్తే చిన్ని కళాకారులు కోలుకోలేరు అని పలువురు అంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more