ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేస్తున్న అందం రకుల్ ప్రీత్ సింగ్. వచ్చినవి మూడు సినిమాలే అయినా.., రెండు సూపర్ హిట్ కావటంతో అమ్మడికి తెగ ఆఫర్లు వస్తున్నాయి. తొలి హిట్ వల్ల మంచి పేరు వచ్చి ‘కిక్2’ వంటి ప్రాజెక్టుల్లో హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇండస్ట్రీలో సినిమా చాన్సుల కోసం చాలామంది భామలు ఎదురుచూస్తుండగా, రకుల్ కు మాత్రం అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఫిలింనగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం, ‘గబ్బర్ సింగ్2’ సినిమాలో కూడా ఈ అమ్మడికి చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
‘గబ్బర్ సింగ్2’ మూవీలో అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. గ్లామర్ రోల్ కోసం మరో హీరోయిన్ ను ఎంపిక చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమే అనేట్లుగా.. రకుల్ ప్రీత్ కు పవన్ యూనిట్ నుంచి ఫోన్ వచ్చినట్లు ఫిలింనగర్ వర్గాలు అనుకుంటున్నాయి. పవన్ సినిమా కావటంతో రకుల్ ఒప్పుకోవటం ఖాయమని తెలుస్తోంది. అయితే కాల్షీట్ల వ్యవహారం తేలాల్సిఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ అమ్మడు మూడు ప్రాజెక్టులకు సైన్ చేసింది. వీటిలో ముఖ్యమైనది రవితేజ నటిస్తున్న ‘కిక్2’. ఈ ప్రాజెక్టుతో పాటు మరో రెండింటిలో నటిస్తున్న రకుల్, పవన్ కోసం వీటిని ఎలా సర్దుబాటు చేసుకుంటుందో.
పవన్ స్వయంగా రాసుకున్న ‘గబ్బర్ సింగ్2’ కథను కే.ఎస్.రవీంద్ర డైరెక్ట్ చేస్తుండగా.., శరత్ మరార్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ‘గోపాల గోపాల’లో నటిస్తున్న పవన్ ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ‘గబ్బర్ సింగ్ 2’ సెట్స్ లోకి వెళ్ళనున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ విడదల అవుతుందని సమాచారం.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more