మూడుపదుల భామ నయనతార ఇదివరకే రెండుసార్లు ప్రేమలో పడి మోసపోయిన విషయం తెలిసిందే! తొలిసారి శింబుతో పీకల్లోతూ ప్రేమాయణం నడిపిన ఈ భామ.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతనితో విడిపోయింది. అనంతరం నృత్య-దర్శకుడు ప్రభుదేవాతోనూ డీప్ లవ్’లో పడింది. అతనికోసం ఈమె తన క్రిస్టియన్ మతం వదిలేసి హిందూమతాన్ని స్వీకరించింది కూడా! నటనక్కూడా స్వస్తి చెప్పింది. ఇక త్వరలోనే వీరి పెళ్లని అనుకుంటున్న తరుణంలో విభేదాలు వచ్చి విడిపోయారు. అలా ఇద్దరితోనూ విభేదాలు రావడంతో ప్రేమను పక్కనపెట్టి మూవీలపైనే దృష్టి సారించింది. రెండో ఇన్నింగ్స్’లోనూ వరుస విజయాలతో క్రేజీ హీరోయిన్’గా దూసుకుపోతోంది.
అయితే.. మూడుపదుల వయస్సు దాటిన నేపథ్యంలో నయనతార పెళ్లి ప్రశ్నలను ఎదుర్కొంటోంది. ఆమధ్య పెళ్లి గురించి అడిగగా.. దానిగురించి ఆలోచించడం లేదని, వరుస మూవీలతో బిజీగా వున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి తనముందుకు పెళ్లి ప్రస్తావన రాగా.. అందుకు ఓ స్వీట్ జవాబు పేర్కొంది. తనను తానుగా ప్రేమించే ఓ మంచి మనసువాడైన వ్యక్తితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని నయనతార స్పష్టం చేసింది. పైగా.. తన పెళ్లి వ్యవహారాన్ని తన తల్లిదండ్రులకే అప్పగించినట్లు ఈ సెక్సీ భామ వాపోయింది. తన తల్లిదండ్రులు మంచి మనసున్న వ్యక్తిని ఎంపిక చేయగలరన్న నమ్మకాన్నీ వ్యక్తం చేసింది.
తల్లిదండ్రులు తనను బాగా అర్థం చేసుకున్నారని, తన మనోభావాలు - ఇష్టాయిష్టాలు వారికి తెలుసునని నయనతార పేర్కొంటోంది. నా ఇష్టం మేరకే ఓ మంచి మనసున్న వ్యక్తిని పేరెంట్స్ ఎంపిక చేస్తారని నమ్మకం వ్యక్తి చేసిన ఈ అమ్మడు... వరుడి అన్వేషణ బాధ్యతను వారికే వదిలిపెట్టినట్లు తెలిపింది. పేరెంట్స్ నిర్ణయించిన వ్యక్తితోనూ తాను ఏడడుగులు నడవడానికి సిద్ధంగా వున్నానని ఈమె స్పష్టం చేస్తోంది. ఇదివరకే రెండుసార్లు ప్రేమలో మోసపోయింది కాబట్టి.. తన కాబోయే వరుడు విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నట్లుంది ఈ అమ్మడు. అందుకే.. పెళ్లి బాధ్యతను తన పేరెంట్స్’కే ఇచ్చేసిందన్నమాట!
AS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more