మూడుపదుల వయస్సు దాటినా తన అందచందాలను ఏమాత్రం తగ్గనివ్వకుండా, నేటి యువతారలకు సైతం ధీటుగా పోటీ ఇస్తూ అనుష్క స్వీటీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే! ఎక్కడో ఓ మూల యోగా టీచర్’గా కొనసాగుతున్న ఈ అమ్మడికి అదృష్టం కలిసిరావడంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో చిన్నాచితకా మూవీలు చేసింది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. నేడు అందనంత స్థాయికి ఎదిగిపోయింది. అయినా అందరితోనూ ఒదిగేవుంటూ, తన మంచి మనసును చాటుకుంటోంది. అందరితోనూ కలిసికట్టుగా వుండే ఈ స్వీటీ.. వున్నట్లుంది కాజల్’ను ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో.. ఇది హాట్ టాపిక్’గా మారింది.
తాజాగా అనుష్క ఓ మీడియాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి తాను చెబుతూనే.. కాజల్’ను ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేసిందని వార్తలొస్తున్నాయి. మొదట తన గత అనుభవాలను గుర్తు చేసుకున్న అనుష్క.. తన మొదటి రోజులని ఎప్పుడూ మరచిపోనని తెలిపింది. అప్పట్లో చేసిన ప్రతి పాత్ర తనను నటించడమెలాగో నేర్పిందేనని పేర్కొంది. అక్కడ చేసిన పొరపాట్లు ఇప్పుడు రిపీట్ కాకుండా చూసుకుంటున్నానని తెలిపిన అనుష్క.. ఆ చిన్న సినిమాలు, పాత్రలు లేకుండా వుండుంటే తాను నేడు ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదంటూ స్పష్టం చేసింది. అంటే.. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. గతంలో ఎదురైన అనుభవాలు, తమ స్థాయికి ఎప్పటికీ మరిచిపోకూడదని హితువు పలుకుతోంది.
ఈ విధంగా అనుష్క కామెంట్లు చేయడంపై ఇండస్ట్రీలో రచ్చరచ్చగా మారింది. ఈ మాటలు ఆమె కాజల్’ను ఉద్దేశించే చెప్పిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. వరుసగా పెద్దహీరోల సరసన సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్’గా పేరొందిన కాజల్ అగర్వాల్.. ఆ మధ్య చిన్నహీరోల సరసన నటించని, పారితోషికం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తేలేదన్నట్లుగా మొండికేసి ఆఫర్స్’ని తిరస్కరించిందనే టాక్ మూటగట్టుకుంది. పైగా.. అప్పట్లో కొన్నాళ్లు ఖాళీగా వుండటంతో ఆ టాక్ కాస్త నిజమేనన్నట్లుగా వార్తలొచ్చాయి. ఈ వార్తలనే దృష్టిలో పెట్టుకుని అనుష్క అలా మాట్లాడి వుంటుందని అనుకుంటున్నారు. అయితే.. వీరిమధ్య ఎటువంటి విభేదాలు లేవు కాబట్టి.. అవన్నీ పుకార్లేనంటూ కొట్టిపారేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more