ప్రస్తుతం మహేష్ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసిన హాట్ బ్యూటీ పూర్ణ.... త్వరలోనే భయపెడుతూ అందాల విందు చేయనుందని తెలిసింది. ‘సీమటపాకాయ్’ సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న పూర్ణ... ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకోవడంలో విఫలమయ్యింది. ఈ సినిమా తర్వాత తన గ్లామర్ డోస్ ను పెంచినా కూడా తెలుగు దర్శకనిర్మాతలను మెప్పించలేకపోయింది. అయినా కూడా తనవంతు ప్రయత్నాలు మాత్రం మానడంలేదు.
ఇటీవలే ఈ అమ్మడు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’ సినిమాలో నటించి, నటిగా మంచి మార్కులే దక్కించుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘అవును2’ తెరకెక్కుతోంది.
అయితే మొదటి పార్ట్ లో మొత్తం భయపెడుతూ, థ్రిల్ కలిగించడంతోనే సినిమా సాగుతుంది. అయితే ఈ సెకండ్ పార్ట్ ‘అవును2’లో మాత్రం భయంతో పాటు భారీ గ్లామర్ ను కూడా జతచేసారని తెలిసింది. ఇందులో పూర్ణ భయపెట్టడమే కాకుండా తన హాట్ హాట్ అందాలతో భారీగా అందాల ప్రదర్శన చేసిందని సమాచారం.
పూర్ణ హాట్ హాట్ అందాలు, నటన ఈ సినిమాకు భారీ ప్లస్ పాయింట్స్ గా చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా తర్వాత తనకు తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తాయనే నమ్మకంతో వుంది పూర్ణ. అలాగే ప్రస్తుతం మహేష్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more