నిన్నటివరకు హీరో సిద్ధార్థతో గ్లామర్ డాల్ సమంత ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే! కొన్నాళ్లపాటు ఇద్దరూ ఓవైపు సినిమాలతో బిజీగా వుంటూనే తమ పర్సనల్ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేశారు. చట్టాపట్టాలేసుకుని తిరిగడం, తమ సినిమాలు హిట్ కావాలన్న ఆశతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం, వీలు దొరికినప్పుడల్లా హ్యాపీగా కాలం గడపడం వంటివి చేశారు. అయితే.. కాలక్రమంలో సిద్ధూ ఆమెకు కొన్ని రూల్స్ ఫాలో అవ్వమంటూ డిమాండ్ చేశాడట! అది నచ్చక సమంతా అతనికి దూరమయ్యిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. అతనితో విడిపోయిన కొన్నికాలాలకే ఈ అమ్మడు ఓ వ్యాపారవేత్త ప్రేమలో పడిందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
చెన్నైకి చెందిన ఓ యంగ్ బిజినెస్‌మేన్‌తో సమంతా కొన్నిరోజుల నుంచి డేటింగ్ చేస్తోందంటూ కోలీవుడ్ లో ఒక్కసారిగా వార్తలు గుప్పుమంటున్నాయి. అతనికి కోలీవుడ్‌లో బాగానే పరిచయాలున్నాయని, కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతనికి, సమంతకి పరిచయం ఏర్పడిందట! అంతేకాదు.. వీళ్ళిద్దరూ ఇప్పటికే కార్పొరేట్ యాడ్స్ కోసం ముంబై, ఢీల్లీ, ఖాట్మండు తదితర ప్రాంతాలకు వెళ్లారని.. ఇప్పుడిప్పుడే వీరి మధ్య వున్న ఎఫైర్ కొందరికి రివీల్ అవుతోందని చెన్నై టాక్. అయితే.. ఆ వ్యాపారవేత్త ఎవరన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాదిలో సమంతా ఓ గుడ్ న్యూస్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని చెన్నై మీడియా చెప్పుకుంటోంది. కానీ.. ఇంతకీ వార్త నిజమేనా..? కాదా..? లేక ఎవరైనా సృష్టించారా..? అన్నది తెలియాలంటే.. మరికొన్నాళ్లపాటు వేచి చూడాల్సిందే!
ఇదిలావుండగా.. ప్రస్తుతం సమంత ఓ వైపు తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉంటూనే పలు కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తోంది. ఈమె నటించిన తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత మరో తెలుగు మూవీ అంగీకరించని సమంత.. తమిళ్లో విక్రమ్‌తో చేస్తున్న మూవీ సమ్మర్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. సూర్యతో జంటగా 24 అనే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఆఫర్ దక్కించుకుంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more