‘జబర్దస్త్’.. ప్రముఖ ఛానెల్ ప్రసారమవుతున్న ఒక కామెడీ షో! ఈ ప్రోగ్రా ఎంత వివాదాస్పదమైందో అంతే హిట్ గా నిలిచింది. బుల్లితెర రంగంలోనే ప్రతిసారి అగ్రస్థానంలో నిలుస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అంతేకాదు.. అందులోని యాక్టర్స్ కి, యాంకర్ కి కెరీర్ పరంగా కూడా ఈ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతోంది. అప్పటివరకు అంతగా గుర్తింపు లేని కమెడియన్లకు ‘జబర్దస్త్’ ద్వారా భారీ పాపులారిటీ దక్కింది. దాంతో వాళ్లకి వరుసగా ఆడియో ఫంక్షన్లలో కామెడీ యాక్ట్ చేసేలా, సినిమాల్లో కమెడియన్లుగా నటించేలా వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి.
ఇక ఇదివరకు యాంకర్ గా చేసిన అనసూయ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా రాత్రికిరాత్రే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. క్యూట్ క్యూట్ హావభావాలు పలకుతూ, అందాలను హోయలొలికిస్తూ ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఒక్కాసారిగా ఈమె యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోవడంతో.. ఈమె ఇమేజ్ ని క్యాచ్ చేసుకోవాలని ఇతర బుల్లితెర ప్రోగ్రాంలు భావించాయి. ఈ క్రమంలోనే ఈమెకి ఇతర షోలకు యాంకరింగ్ చేసే ఆఫర్లు కుప్పలుతెప్పలుగా రావడంతో.. ఈమె ‘జబర్దస్త్’ షోకి భారీ షాకిచ్చింది. తన కెరీర్ అందనంత ఎత్తుకు తీసుకెళ్లిన ఆ షోని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఈమె స్థానంలో రష్మీని యాంకర్ గా తీసుకొచ్చారు.
మొదట సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన రష్మీ.. అక్కడ తనకు పంట పండగకపోవడంతో ‘యువ’ సీరియల్ తో బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత యాంకర్ గా మారింది. అప్పటివరకు ఈమెకి ఏమాత్రం గుర్తింపు లేదు. అయితే.. అనసూయ పుణ్యమా అని ఈమెకు ‘జబర్దస్త్’ షోకి యాంకర్ చేసే అవకాశం వచ్చింది. అంతే.. ఈమె కూడా తన మాటలతో, గ్లామర్ తో బుల్లితెరపై మాయ చేసేసింది. రాత్రికిరాత్రే భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఈమెకి ఆడియో ఫంక్షన్లతో యాంకరింగ్ చేసే అవకాశాలతోపాటు మళ్లీ సినిమాల్లో నటించే ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.
ఈ క్రమంలోనే రష్మీకి ‘చందమామ కథలు’ సినిమాతో నేషనల్ అవార్డ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుంటూరు టాకీస్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం లభించింది. ఒకవేళ ఈ సినిమా హిట్టైతే.. తన మళ్లీ కెరీర్ పట్టాలెక్కుతుందని ఆమె భావిస్తోంద. అలా జరిగితే.. యాంకర్ నుంచి తప్పుకుని సినిమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి ఆమె నిర్ణయించుకున్నట్లు ఆమె స్నేహితులు చెబుతున్నారు. చూస్తుంటే.. త్వరలో ఈమె కూడా జబర్దస్త్ ప్రోగ్రాంకి షాకివ్వనుందని అనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more