నాకు మరొకరు చేసిన పాత్రల కంటే ఒరిజినల్ కేరక్టర్లు చేయడమే ఇష్టం. అందుకే రీమేక్స్‌ని నేను ఇష్టపడను. ఒకవేళ అలాంటి ఆఫర్లు వస్తే చేయాలో, వద్దో అప్పటి సందర్భాన్ని బట్టి నిర్ణయించుకుంటా'' అని చెప్పారు అందాల తార కాజల్ అగర్వాల్. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 'బాద్‌షా' చిత్రంలో హీరోయిన్‌గా అలరించిన ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే...
'బాద్‌షా' ఘన విజయం సాధించినందుకూ, అందులో నేను చేసిన జానకి పాత్ర ఆదరణ పొందినందుకూ చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నింటిలో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న కేరక్టర్ ఇది. నటించేప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేశా. ఎన్టీఆర్‌తో ఇది రెండో సినిమా. తను చక్కని సహ నటుడు. అతనితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. డైరెక్టర్ శ్రీను వైట్ల బాగా కష్టపడే తత్త్వమున్న మనిషి. స్నేహంగా మెలగుతారు. సీన్ చేసేప్పుడు కామిక్ టైమింగ్ విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. అందువల్లే ఆయన సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ అంతగా పండుతుంది.
విలక్షణతోటే సంతృప్తి
డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మేట్రాన్ (బ్రదర్స్), తుపాకి, ఇప్పుడు 'బాద్‌షా' సినిమాల్లో నేను చేసిన పాత్రలు నాకు సంతృప్తినిచ్చాయి. అవన్నీ ఒకదానికొకటి భిన్నమైన పాత్రలే. సంతృప్తినిచ్చేది విలక్షణతే కదా. ఇప్పుడు నేను అభినయానికి అవకాశమున్న పాత్రలే చేస్తున్నాను.
డ్రీమ్ రోల్స్
మంచి స్క్రిప్టులు వస్తే నాయిక ప్రాధాన్య సినిమాలు చేయడానికి సిద్ధమే. గతంలో అలాంటి అవకాశాలు వచ్చాయి కానీ చేయడానికి వీలుపడలేదు. డ్రీమ్ రోల్స్ చాలానే ఉన్నాయి. నెగటివ్, పోలీస్, యాక్షన్, కామెడీ కేరక్టర్లు చేయాలని కోరుకుంటున్నా. అలాగే ఓ మంచి లవ్‌స్టోరీ చేయాలని ఉంది.
నా ఫిలాసఫీ
నాకు నేనే పెద్ద విమర్శకురాల్ని. నేను చేసే పనిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటాను. అయినా కూడా జనాభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాను. స్వీయ నియంత్రణ ఉండాలని నమ్ముతాను. అప్పుడే క్రమశిక్షణ అనేది అలవడుతుంది. విజయాన్ని నెత్తికెక్కించుకున్నామా, అదే పతనానికి దారి తీస్తుందనేది నేను నేర్చుకున్న ఫిలాసఫీ.
హిందీ కంటే తక్కువ కాదు
కంటెంట్ విషయంలో హిందీ కంటే తెలుగు వెనుకంజలో ఉందనే దాన్ని నేను నమ్మను. ఎందుకంటే ఇవాళ తెలుగు సినిమాల్నే అక్కడ పెద్ద పెద్ద హీరోలు రీమేక్ చేస్తున్నారు. సినీ రంగంలో పురుషాధిక్యత ఉన్నా మహిళలకు కూడా మంచి అవకాశాలే వస్తున్నాయి. తెలుగులో నా అభిమాన హీరో ఎప్పటికీ నాగార్జున గారే.
సామాజిక సేవ
సామాజిక కార్యక్రమాలకి కొంత సమయాన్ని కేటాయిస్తున్నాను. ప్రస్తుతం యు.బి.ఎం. అనే అంతర్జాతీయ మీడియా బిజినెస్ కంపెనీకి నా వంతు సహకారం అందిస్తున్నాను. సమాజంలోని వివిధ రకాల వ్యక్తులకు అవకాశాలు కల్పించడంతో పాటు మహిళలు, పిల్లలు, పేదలకు సహాయ సహకారాలు అందిస్తోన్న సంస్థ అది.
తెలుగులో కొత్తవేం లేవు
ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్ సినిమా 'ఎవడు'లో ప్రత్యేక పాత్ర చేస్తున్నాను. అందులో అల్లు అర్జున్ జోడీగా కనిపిస్తా. అతనిదీ స్పెషల్ అప్పీరెన్సే. తెలుగులో కొత్తగా ఇంకా ఏ సినిమాకీ కమిట్ కాలేదు. తమిళంలో కార్తీతో 'ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా', విజయ్‌తో 'జిల్లా' చేస్తున్నా. 'స్పెషల్ 26' తర్వాత బాలీవుడ్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయి. అవి చర్చల దశలో ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more
Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు... టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more
Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more
Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more
Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more