Director mohan krishna indraganti interview

Director Mohan Krishna Indraganti Interview

Director Mohan Krishna Indraganti Interview

విలక్షణ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి

Posted: 08/24/2013 07:12 PM IST
Director mohan krishna indraganti interview

సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ కలిపి ఒకేసారి చూడలేం. కానీ కలిపి చూపిస్తాడు ఇంద్రగంటి. అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్ చిత్రాల్లో ఆయన చేసిన మేజిక్ అదే. ఆయన దర్శకత్వం వహించిన ‘అంతకు ముందు-ఆ తరువాత’ చిత్రం విడుదల ఈ సందర్భంగా ఇంద్రగంటితో కాసేపు...
 
 ‘అంతకు ముందు- ఆ తరువాత’ అంటున్నారు. ఇంతకు దేని ముందు, దేని తర్వాత?
 పెళ్లి ముందు.. పెళ్లి తర్వాత ‘ఐ లవ్‌యూ’ అనే మాటకు ముందు.. కమిటైన తర్వాత. ప్రేమకు ముందు గానీ, పెళ్లికి ముందుగానీ.. తన భాగస్వామిని ఇష్టంతో చూస్తారు కానీ, లోతుగా మాత్రం ఎవ్వరూ చూడరు. ఎందుకంటే... వాళ్లిద్దరూ కలిసి బతికింది తక్కువ సమయంలో కాబట్టి. కానీ పెళ్లయ్యాక, ప్రేమలో దిగాక వారి మనోభావాలు మారిపోతాయి. కారణం.. ఇద్దరూ ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. ఒకరి గురించి ఒకరికి చాలా విషయాలు తెలుస్తుంటాయి. అప్పుడే వాళ్లకు కొత్త కొత్త సందేహాలు తలెత్తుతుంటాయి. మనం సరైన భాగస్వామిని ఎంచుకున్నామా? అనే మీమాంసలోనే ఎక్కువ కాలం గడిపేస్తుంటారు. ఇలాంటి సమస్యలే ఓ యువజంటకు తలెత్తితే... వారి సందేహాలను వారు ఎలా నివృత్తి చేసుకున్నారు? అనేదే నేను తెర పై చూపించాను.

సినిమా సినిమాకీ ఎందుకింత విరామం?
 తనికెళ్ల భరణి నన్ను ‘హేలీ తోకచుక్క’ అంటుంటారు. లేట్‌గా సినిమాలు చేస్తానని ఆ బిరుదిచ్చారు(నవ్వుతూ). నా సినిమాలు ఆలస్యం కావడానికి కారణం నేనే. నాకు అసిస్టెంట్‌లు లేరు. నా కథలు నేనే రాసుకుంటాను. దానికి తగ్గ నిర్మాత దొరకాలి. అభిరుచికి తగ్గట్టు సినిమా చేయాలి. అందుకే ఈ ఆలస్యం.
 
ఎప్పుడూ సున్నితమైన కథలేనా? యాక్షన్ సినిమాలు కూడా చేయొచ్చుగా? 
అనుబంధాల మధ్య పోరాటం అంటే నాకిష్టం. ఫిజికల్ వయొలెన్స్‌పై అంత ఆసక్తి ఉండదు.

అంటే మీ నుంచి అన్నీ ఇలాంటి కథలే వస్తాయా?
నా ‘గ్రహణం ’ చలంగారి రచన ఆధారంగా చేసిన సినిమా. ‘మాయాబజార్ ’ ఓ సోషియో ఫాంటసీ కథ. ‘అష్టాచెమ్మా ’ ఫ్యామిలీ నేపథ్యం. ‘గోల్కొండ హైస్కూల్ ’ క్రీడా నేపథ్యం. ఇప్పుడు ‘అంతకు ముందు- ఆ తరువాత’ రొమాంటిక్ కథాంశం. ఇప్పటివరకూ పొంతన లేని కథలతోనే సినిమాలు చేశాను. త్వరలో యాక్షన్ కథాంశంతో కూడా సినిమాలు చేస్తానేమో. నేనంటూ యాక్షన్ సినిమా చేస్తే... హీరోని మాత్రం దైవాంశ సంభూతునిగా చూపించను. హీరో ఇంట్రడక్షన్‌లోనే నాలుగొందలమందిని కొట్టేయడం నా స్కూల్ కాదు. నా యాక్షన్ హీరో కూడా సాధరణ వ్యక్తే అయ్యుంటాడు. స్ట్రగుల్స్ నుంచే అతని పోరాటం మొదలవుతుంది. అసలు నా దృష్టిలో యాక్షన్ సినిమా చేయడం తేలిక. ఆప్యాయతల్ని సింపుల్‌గా తెరపై క్యారీ చేయడమే కష్టం.
 
తెలుగులో కథల కొరత ఉందని చాలామంది అభిప్రాయం. నిజమేనా?
పచ్చి అబద్ధం. మనదగ్గరే లక్షల కథలున్నాయి. చలం, కొడవటిగంటి కుటుంబరావు లాంటివారి సాహిత్యం చదివితే... లెక్కలేనన్ని కథలు వాటంతటవే పుడతాయి. అంతెందుకు మన ఆధునిక కవులు చాలామంది మంచి కథలు రాస్తున్నారు. మహ్మద్ ఖదీర్‌బాబు లాంటివారి కథలు చదివితే ఆటోమేటిగ్గా మంచి కథలు దొరుకుతాయి. ప్రస్తుతం తమిళ దర్శకులు చేస్తున్నది అదే. వారి ప్రాచీన తమిళ సాహిత్యం ద్వారా గొప్ప గొప్ప కథలను సృష్టించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రయత్నం చేయకుండా కథలు లేవనుకుంటే ఎలా? ‘మాకు ఆస్కార్ ఎందుకురాదు?’ అని ఎదుటివారిని ప్రశ్నించడం కాదు. ఎందుకు రావాలి? అని మనకు మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనం చేస్తున్న తప్పులేంటో మనకు తెలుస్తాయి.
 
మీ డ్రీమ్ ప్రాజెక్ట్‌లు ఏమైనా ఉన్నాయా ?
కొడవటిగంటి కుటుంబరావు కథలు సినిమాగా చేస్తే బావుంటుంది. అలాగే... బుచ్చిబాబు రాసిన ‘చివరకు మిగిలేది ’ సినిమాగా చేస్తా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Character artist rajitha interview

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజితతో...

    Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more

  • Nagarjuna special interview for bhai movie

    ‘భాయ్ ’ నాగార్జునతో కాసేపు

    Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు...  టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more

  • Actress shriya saran chit chat

    శ్రీయ చెప్పిన చిట్టి చిట్టి మాటలు

    Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more

  • Chit chat lyricist bhaskarabhatla ravi kumar

    రచయిత భాస్కర భట్లతో

    Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more

  • O malli movie interview with ramya sri

    ‘ఓ మల్లి ’ సినిమా గురించి రమ్య శ్రీ

    Jul 12 | మూవీ మొఘల్‌ డాక్టర్‌ రామానాయుడు ‘తాజ్‌ మహల్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ వైజాగ్‌ ముద్దుగుమ్మ ఈ పదేళ్ళలో చాలా సినిమాలు చేసింది. ఐటం గాళ్‌గా, వ్యాంప్‌ పాత్రల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.... Read more