మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు ‘తాజ్ మహల్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ వైజాగ్ ముద్దుగుమ్మ ఈ పదేళ్ళలో చాలా సినిమాలు చేసింది. ఐటం గాళ్‌గా, వ్యాంప్ పాత్రల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా ఎక్కడా క్లిక్ కాలేకపో యింది. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘సింహా ద్రి’ చిత్రాలలో కాస్త గుర్తుండి పోయే రోల్స్ చేసింది రమ్య శ్రీ. ఈ వ్యాంప్ సుందరి చిత్రసీమలో పెద్ద పేరు తెచ్చుకున్న ది లేదు. అయితే, అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గలేదు. దీంతో చిత్రసీమలో ఆమె క్రేజ్ మాత్రం తగ్గటం లేదు.
దర్శకురాలిగా...
తెలుగులో మెగాఫోన్ పట్టిన ఆర్టిస్టులు చాలా అరుదు. ఇప్పుడా జాబితాలో నటి రమ్యశ్రీ చే రింది. ఆమె రూపొందించిన చిత్రం ‘ఓ మల్లి’. దాదాపు పధ్నాలుగేళ్ల క్రితం అనుకు న్న కథకు ఇప్పుడు తెరరూపం ఇచ్చారా మె. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్ర కూడా చేశారు. సమాజంలో స్ర్తీలకు జరుగు తున్న అన్యాయాలను ప్రధానాంశంగా తీసుకుని రమ్యశ్రీ ఈ చిత్రం చేసింది.
‘ఓ మల్లి’ కథేంటి?
మల్లి అనే పేద మహిళ స మాజంలో మహిళలపై జరు గుతున్న అన్యాయాల మీద ఎలా పోరాడిందో అనే కథతో సినిమాను తెరకెక్కించింది రమ్యశ్రీ. వేరే నటి అయితే తాను ఉహించిన విధంగా నటించలేదనే భయంతో ప్రధాన పాత్రలో తానే నటిస్తోంది. ఈ ‘ఓ మల్లి’ సినిమా కు చెందిన ప్రచార చిత్రాల ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ మాట్లాడుతూ ‘‘స్ర్తీల మ నో వేదనకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. 14 ఏళ్ళ క్రితంనుండి నా మనసులో ఈ కథ మెదులుతోంది, వేరే వారికి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తే కథ చెడిపో తుందన్న భయంతో స్వయంగా నేనే ఈ ఈ సినిమాకు దర్శకత్వం వహించే ప్రయత్నం చేశాను. చిత్రంలోని పాటలు పాడిన జేసుదాస్ ఎంతగానో మెచ్చుకున్నారు. చిత్రం చూసిన ప్రతివారికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అని తెలిపింది రమ్యశ్రీ.
రమ్యశ్రీ తెరాటమీ...
రమ్యశ్రీ అసలుపేరు సుజాత. చిత్రరంగంలో అడుగిడిన తర్వాత అప్పటికే అదే పేరుతో మరొక నటి ఉండటంతో తన పేరును మార్చుకొంది. పుట్టింది విశాఖపట్నంలో. కన్న డ, తమిళ, మళయాల, హిందీ మరియు భోజ్‌పురి భాషల లో 250 చిత్రాలలో నటించింది.కన్నడలో ప్రధాన నాయిక గా 36 చిత్రాలలో నటించింది. ఈమె నటించిన ‘ఆర్యభట్ట’ అనే కన్నడ చిత్రానికి కర్ణాటక రాష్ట్రప్రభుత్వ పురస్కారం కూడా లభించింది.
(And get your daily news straight to your inbox)
Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more
Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు... టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more
Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more
Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more
Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more