Interview with prachi desai

Interview with Prachi Desai

Interview with Prachi Desai

టీవి కమ్ యాక్ట్రస్ ప్రాచీదేశాయ్

Posted: 08/24/2013 07:16 PM IST
Interview with prachi desai

టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి, ఆ ఒక్క సీరియల్‌తోనే సినిమాల్లో చాన్స్ కొట్టేసిన ప్రాచీ ఈమె చెబుతున్న కొన్ని విషయాలు...   

మాది సూరత్ (గుజరాత్). తొమ్మిదో తరగతి వరకూ అక్కడే చదివాను. తర్వాత చదువంతా పుణెలో సాగింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లో అడుగుపెట్టాను. అవకాశాలు అంది వచ్చాయి. బాగా బిజీ అయిపోవడంతో చదువుకు స్వస్తి చెప్పేశాను. అప్పుడు నాకు పదిహేడేళ్లు. ఓరోజు అనుకోకుండా బాలాజీ టెలిఫిల్మ్స్ నుంచి ‘కసమ్‌సే’ సీరియల్‌లో నటించమని పిలుపు వచ్చింది. ఏక్తాకపూర్ బ్యానర్లో చాన్స్ రావడమనేది అదృష్టం కదా! అందుకే వెంటనే ఓకే చెప్పేశాను. ‘బానీ ’ పాత్ర నన్ను పాపులర్ చేసింది. చాలా అవార్డులు అందుకున్నాను.
    

2007లో ప్రముఖ డ్యాన్స్ షో ‘ఝలక్ దిఖ్‌లాజా’ రెండో సిరీస్‌లో పాల్గొని, గెలవడం మర్చిపోలేని అనుభూతి. అంతవరకూ సీరియల్ పాత్ర పేరుతో ‘బానీ ’ అని పిలిచినవారంతా ‘ప్రాచీ ’ అని పిలవడం మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు ‘కసమ్‌సే’లో నటించాక  ‘రాక్ ఆన్ ’ చిత్రంలో నటించే చాన్స్ వచ్చింది.  ఫర్హాన్ అక్తర్ భార్యగా నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో అవకాశాలు వరుసగా రావడం మొదలైంది. లైఫ్ పార్ట్‌నర్, ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, తేరీ మేరీ కహానీ, బోల్ బచ్చన్, ఐ మి ఔర్ హమ్, పోలీస్‌గిరి... ఇలా వరుసగా చేసుకుంటూ పోతున్నాను.
   

నిజానికి సినిమాల వైపు వెళ్లాలని నేనేమీ అనుకోలేదు. అలాగని వచ్చిన అవకాశాన్ని వదులుకోవడమూ ఇష్టం లేదు. అందుకే  వచ్చిన చాన్‌‌సని ఉపయోగించుకున్నాను. అయితే టీవీని పూర్తిగా వదిలేయలేదు. ప్రాచీ అంటే ఎవరో అందరికీ తెలిసింది సీరియళ్ల వల్లనే. అందుకే నేనెప్పుడూ వాటిని వదులుకోను. మంచి సీరియల్ చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాను. నాకు తెలిసి టీవీకి పని చేయడమే ఎక్కువ కష్టం. వరుస షెడ్యూళ్లు, కొన్ని గంటలపాటు అలుపు లేకుండా నటించాలి, ఎమోషన్స్ ఎక్కువగా ప్రదర్శించాలి. అదే సినిమా అయితే పరిమిత సమయాలు, గంటలపాటు షూటింగ్ జరగడమనేది ఎప్పుడో కానీ ఉండదు, క్యారెక్టర్‌కి కూడా పరిమితి ఉంటుంది. 
    

అందరూ అనుకునేదేమిటంటే, బుల్లితెర నటీనటులు వెండితెర మీద వెలగలేరని. అది ఎంతమాత్రం నిజం కాదు. నటన తెలిసినవారికి సినిమా రంగమైనా, టెలివిజన్ రంగమైనా ఒకటే. ఆ పాత్రను ఎంత బాగా ఓన్ చేసుకున్నాం, దానికి ఎంతవరకూ న్యాయం చేయగలం అన్నదాన్నిబట్టే ఉంటుంది సక్సెస్ !
 

నా పెళ్లి గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు. నిజానికి నాకు పెళ్లి ఆలోచన లేదు. అస్సలు చేసుకోనని కాదు గానీ, ఇప్పుడు మాత్రం చేసుకోను. ఒంటరిగా ఉండటం బాగుంది. ఇప్పుడు తోడు కోసం కంగారు పడాల్సిన అవసరం కనిపించడం లేదు. కాబట్టి నేనసలు పెళ్లి గురించి టెన్షన్ పడట్లా అనుకుంటూ ముగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Interview with mogalirekulu fame karuna

    మొగలిరేకులు ఫేం కరుణతో

    May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more

  • Interview with goreti venkanna

    ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న

    Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more

  • Tv actor gurmeet choudhary interview

    Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more

  • Mogalirekulu ravi krishna interview

    మొగలిరేకులు రవి కృష్ణ ఇంటర్వ్యూ

    Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more

  • Interview with sanaya irani

    ఇంటర్వ్యూ విత్ సానయ ఇరాని

    Jan 02 | కళకు భాషా భేదాలు ఉండవన్న మాట, నటన విషయంలో ముమ్మాటికీ నిజమేననిపిస్తుంది. కాబట్టే మన తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సీరియల్స్‌ని సైతం ఆదరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మనవారి మనసులు దోచుకున్న డబ్బింగ్ సీరియల్స్‌లో ‘చూపులు... Read more