అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?
ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు.
తరచుగా వాడే మాట?
నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి వస్తుంది. అంతేకాదు, ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు అమ్మా అమ్మా అమ్మా, తల్లీ తల్లీ తల్లీ అని చాలాసార్లు అంటుంటా.
ఎందుకు ఇలా చేశానా అని బాధపడుతున్నది ఏదైనా ఉందా?
ఉంది. కానీ దాన్ని పైకి చెప్పుకోలేను. చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను.
అత్యంత సంతోషపడిన సందర్భం?
ప్రజాతంత్ర సాహిత్య పత్రికలో నా గురించి పది పేజీల వ్యాసం ప్రచురితమయ్యింది. అది చదివితే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. కీర్తికి దూరంగా ఉండే నేను, ఎందుకో దాన్ని చూసి చాలా మురిసిపోయాను.
ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి?
మొదట మా ఆవిడకు... ఎందుకు అని మాత్రం అడగొద్దు. ఇంకొకరికి కూడా చెప్పాలి. కానీ ఇప్పుడు తన పేరు చెప్పను. ఎందుకంటే , ఆ క్షమాపణ డెరైక్ట్‌గా తనకే చెప్పాలి.
బాగా ఏడ్చిన సందర్భం?
మా నాన్న చనిపోయినప్పుడు పడినంత బాధ నేనెప్పుడూ పడలేదు. ఆయన ఎంతో నిరాడంబరుడు. ఎవరి దగ్గరా ఏదీ ఆశించేవాడు కాదు. గొప్ప మనిషి!
మీ గురించి ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే విషయం?
నేను మాంచి రసికుడినని, చాలా రొమాంటిక్ అని అనుకుంటారు చాలామంది. కానీ అది నిజం కాదు.
మీలో మీరు మార్చుకోవాలనుకునేది?
నేను చాలా సెన్సిటివ్. చాలా త్వరగా భావోద్వేగాలకు లోనవుతుంటాను. దాన్ని మార్చుకోవాలి.
మీ హృదయాన్ని స్పృశించిన సాహిత్యం?
చాలా ఉన్నాయి. కానీ... కేశవరెడ్డి సాహిత్యం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ తర్వాత అజంతా!
మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి?
ఒక్కరు కాదు, ఇద్దరు... మా అమ్మానాన్నలు.
మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం?
నేను చాలా మెతక అనుకుంటారంతా. నేను మెతకే. కానీ అంతకంటే మొండివాణ్ని. ఇది జరగాలి అనుకుంటే జరిగేవరకూ వదలను. ఆ విషయం చాలామందికి తెలియదు.
మీలో మార్పు తెచ్చిన సంఘటన?
ఓసారి ఎమ్మడిజెట్టి చంద్రయ్యగారికి సన్మానం చేయాలని పిలిస్తే... ఆయన రానన్నారు. నాకు సన్మానాలెందుకు, మీరు చేయించుకోండి అన్నారు. నాకు కొరడాతో కొట్టినట్టయ్యింది. నాకు ఎంతోమంది సన్మానాలు చేస్తామంటూ వస్తారు. కానీ నేనెప్పుడూ ఆయనలా అనలేదు. అంత గొప్ప వ్యక్తి, మహాకవి, అవధాని అయ్యుండి సన్మానాన్ని తోసిపుచ్చారంటే ఆయనేంటో అర్థమయ్యింది. ఎంత ఎదిగినా ఆయనలా ఒదిగి ఉండాలని తెలిసొచ్చింది.
ఎదుటివారిలో మీకు నచ్చేది?
కళ. కళాకారులంటే చాలు, తెగ ఇష్టపడిపోతాను.
ఎదుటివారిలో నచ్చనిది?
పైకి ఒకలా, లోపల ఇంకోలా ఉండటం.
మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం...?
హిపోక్రసీ... ఏమాత్రం సహించలేను!
మీలో మీకు నచ్చే విషయం?
ఎవరి దగ్గరా ఏదీ ఆశించని తత్వం. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్ప ఒక్క పైసా కూడా తీసుకోను.
మీలో మీకు నచ్చని విషయం?
పొగడ్తకు చెవి ఒగ్గకూడదనుకుంటాను. కానీ అలా ఉండలేను.
దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు?
నెత్తురు చుక్క నేలరాలని లోకాన్ని సృష్టిస్తాను.
మీరు నమ్మే సిద్ధాంతం?
ఉన్నదున్నట్టు అంగీకరించడం, సహజత్వం, పరిమితం, ప్రశాంతం... ఇదే నా లైఫ్ ఫిలాసఫీ.
ఈ క్షణం మీ మనసులో మెదులుతున్న విషయం?
ఎప్పుడు ఏ క్షణంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మదిలో మెదిలేది... కేవలం బుద్ధుడే!
ఇంకా మిగిలివున్న కోరిక?
కోరిక అంటే నరకం. నరకాన్ని ఎవరు కోరుకుంటారు!
జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఎలా గడుపుతారు?
వెన్నెలని చూస్తూ... మంచి సంగీతం వింటూ ఉండిపోతాను. విప్రనారాయణ సినిమా పాటల్లాంటివి వింటూ ప్రాణాలు విడుస్తా.
ఎలాంటి మరణాన్ని కోరుకుంటారు?
ప్రశాంతంగా... నిశ్చలంగా... నిర్వికారంగా... ప్రేయసి ఒడిలోకి వెళ్లినట్టుగా మృత్యువు ఒడిలోకి వెళ్లాలి.
(And get your daily news straight to your inbox)
Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్సే’ సీరియల్లో మెరిసి,... Read more
May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more
Mar 08 | సీరియల్లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more
Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more
Jan 02 | కళకు భాషా భేదాలు ఉండవన్న మాట, నటన విషయంలో ముమ్మాటికీ నిజమేననిపిస్తుంది. కాబట్టే మన తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సీరియల్స్‌ని సైతం ఆదరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మనవారి మనసులు దోచుకున్న డబ్బింగ్ సీరియల్స్‌లో ‘చూపులు... Read more