రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఎప్పుడు కలుస్తారో చెప్పలేము. కానీ ఎందుకు కలుస్తారో మాత్రం చెప్పవచ్చు. సమకాలీన రాజకీయ పరిస్థితులతో పరిచయమున్నవాళ్ళెవరైనా ఊహించుకోగలుగుతారు.
మధ్యలో పచ్చగడ్డి వేస్తేనే చాలు భగ్గుమనే అవకాశమున్న కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీల మధ్య సయోధ్య కుదిరిందా అంటే ఆలోచించకుండా వెంటనే ఔనంటుంది భాజపా.
అలాంటి మాట రాగూడదనే ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంతకాలం తాత్సారం చేసారు. డిసెంబర్ 9 కల్లా ఢిల్లీ ఎన్నికల బరిలో పోటీకి నిలబడ్డ భాజపా, ఆప్, కాంగ్రెస్ లకు 32, 28, 8, ఇండిపెండెంట్ లకు 2 సీట్లు వచ్చినట్లు గా తేలిపోయింది. కానీ ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవటంతో పీటముడి పడింది.
చివరకు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వటానికి తయారై కేజ్రీవాల్ ని ప్రభుత్వం ఏర్పరచమని కోరినా కేజ్రీవాల్ ఇన్నిరోజులుగా ఆ విషయాన్ని దాటవేస్తూ వచ్చారు. చివరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా ఢిల్లీ గద్దెను అధిరోహించటానికి సంసిద్ధతను తెలియజేసారు.
ఇప్పడు ఆయనను అభినందించిన ప్రతిసారీ భాజపాకు చివుక్కుమనటం ఖాయం. అంతేకాకుండా, భాజపా, ఆప్ ల మధ్య సయోధ్య కుదరకుండా ఉంటుంది. ఎన్నికల్లో ఎలాగూ పోయింది కానీ కనీసం ఆధిక్యత లభించిన పార్టీలలో పొత్తు లేకుండా చెయ్యటం ద్వారా కొంతైనా సాధించినట్లవుతుందని కాంగ్రెస్ వ్యూహమన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కేజ్రీవాల్ నిర్ణయాన్ని కొనియాడిన వెంటనే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముఖ్య సచివుడైన దిగ్విజయ్ సింగ్ కూడా తన అభినందనలను తెలియజేసారు. అప్పుడే అవలేదు. ఇంకా మిగిలిన కాంగ్రెస్ నేతలు కూడా ఒక్కక్కరుగా కేజ్రీవాల్ ని అభినందిస్తూ పోతారు.
దానితో కేజ్రీవాల్ కి పట్టం కట్టి తప్పు చేసామా అనే భావన ఢిల్లీ ప్రజలలో కలుగజేయటానికి, దాన్ని పెంచి పెద్ద చెయ్యటానికి భాజపాకు చాలా అవకాశం దొరుకుతుంది. కాంగ్రెస్ అవినీతిని, అసమర్ధ పాలనను ఎండగట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నిజ స్వరూపమిదే సుమా అని చెప్పటానికి మంచి తరుణమౌతుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more