తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఈరోజు కలవటంతో రాజకీయ రంగులు పూర్తిగా మారిపోయాయి. ఒక గంట క్రితం వరకు చంద్రబాబు పై బెట్టు(అలిగిన) అసహనం ఉన్న నాయకులు మేలుకోని పార్టీ ఆఫీస్సు మెట్లు ఎక్కుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి వస్తున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.
గత కొద్ది కాలంగా చంద్రబాబు, ఎన్టీఆర్ల మద్య సైలెంట్ యుద్దం నడిచిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కొంచెం బెట్టుగా ఉన్నట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.ఒక పక్క బాలయ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతు.. పార్టీ గెలుపు కోసం తనవంతు సాయం చేస్తున్నారు.
సందంట్లో సడేమియలాగా.. తారక రత్న, నారా రోహిత్, ఎన్నికల ప్రచారం బాట పడుతున్నారు. అంతేకాకుండా .. బాలయ్య నిన్న మాట్లాడుతూ.. పార్టీ ఎవరికి బొట్టు పెట్టి పిలవదని తన కుటుంబ సభ్యులకు చురకలు అంటించారు. దీంతో ఎన్టీఆర్ లో చలనం వచ్చిందని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.
జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటంతో ..టిడిపి నాయకుల ముఖాలపై గెలుపు ఆనందం కనబడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానుల నుండి ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోజూ.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరుపు ప్రచారం చేయటానికి సిద్దమైనట్లు పార్టీ వర్గలు అంటున్నాయి.
జూ. ఎన్టీఆర్ ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్ పార్టీలోని సీనియర్ నాయకులు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, జూ. ఎన్టీఆర్ ఒక వేదిక పై కనిపిస్తే.. పార్టీకి మంచిదనే ఉద్దేశంతో ఆ దిశగా రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
జూ.ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీ తరుపున రాష్ట్రం మొత్తం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. 2014 లో కూడా అదే విధంగా ఉండాలని జూ. ఎన్టీఆర్ కోరినట్లు తెలుస్తోంది. జూ. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం గురించి పార్టీ నుండి అధికారకంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
కానీ జూ. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం విషయం చంద్రబాబు, బాలయ్య, పవన్ కళ్యాన్, కొంతమంది సీనియర్ నాయకులు కలిసి చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నారు. అందులో బాగంగానే.. ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినట్లు పార్టీలోని సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
ఇక ఒకే వేదికపై.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య, జూ. ఎన్టీఆర్, నారా రోహిత్, తారక రత్నలు కనిపించటానికి ఎన్టీఆర్ భవన్ లో భారీ ప్లాన్ జరుగతుందని టిడిపి అభిమానులు అంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more