చెన్నై సుందరి సమంతా కోరికతో.. మలీవుడ్ హీరోయిన్లు తలపట్టుకున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ , కోలీవుడ్ లో సమంతాకు ఎదురు లేదు? ఏ హీరోతోనైన సై అంటూ.. ముందుకు దూసుకుపోతుంది. సమంతా కనిపిస్తే.. చిన్న చిన్న హీరోయిన్లు భయంతో వణికిపోతున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. మాలీవుడ్ కూడా నాదే అంటుంది చెన్నై సుందరి సమంత. ఈ బ్యూటి మాటలకు కొంచెం క్లారిటీ కావాలా? ఈ అమ్మడి తల్లి కేరళలోని ఆలప్పుళంలో జన్మించారట. దీంతో మాలీవుడ్ తన మాతృగడ్డేనంటున్నారు. ఇంతకీ ఈ బ్యూటి గొడవేమిటంటారా? ఆమె ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజి హీరోయిన్‌గా వెలిగిపోతున్నారు. మరో విశేషం ఏమిటంటే- ఇటీవలే బాలీవుడ్ నుంచి సమంతకు పిలుపు వచ్చింది. అక్కడ క్రేజీ స్టార్ అక్షయ్‌కుమార్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు.
దీంతో మరో కోలీవుడ్ లక్కీ హీరోయిన్ శ్రుతిహాసన్‌కు సమంత పోటీగా తయారవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. నటి సమంత తాజాగా మాలీవుడ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ మలయాళంలో నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే తన తల్లి పుట్టింది ఆలప్పుళం అనే విషయాన్ని బయటపెట్టి ఆ విధంగా సెంటిమెంట్‌తో మాలీవుడ్‌లోనూ పాగా వేయాలని చూస్తున్నట్లు చెప్పకనే చెప్పింది.
ఏదేమైనా- సమంత మాలీవుడ్ కోరిక అక్కడి హీరోయిన్లకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అక్కడ హీరోయిన్ల కొరత ఉంది. ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్లుగా వెలుగొందుతున్న కావ్యా మాధవన్, రీమా కళింగళ్, మంజు వారియర్, అనన్య వంటి వారు వివాహితులయ్యారు.
ఇకపోతే అక్కడ యువ హీరోయిన్లుగా పరిచయమైన కొందరు కోలీవుడ్‌లో అవకాశాలు రావడంతో జంప్ జిలాని బాట పడుతున్నారు. మేగ్నారాజ్, భావన, భామ వంటి హీరోయిన్లు మాలీవుడ్‌పై దృష్టి సారిస్తున్నారు. ఇక సమంత విషయానికొస్తే- టాలీవుడ్, కోలీవుడ్‌లో మాదిరిగానే మాలీవుడ్‌లోను చక్రం తిప్పాలని ఆశిస్తున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more