సినిమా ఇండస్ట్రీలోకి వారవసత్వంగా వస్తూ వెండితెర పై వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు సినీ స్టార్ల కూతుర్లు, కుమారులు. ఒకప్పుడు క్లాసిక్ డాన్సర్ కమ్ హీరోయిన్ గా వెండితెరను ఓ ఊపు ఊపిన రాధా కూతుళ్లు కూడా వెండితెర ఎంట్రీ ఇచ్చారు. అందులో పెద్ద కుమార్తె టాలీవుస్టార్ హీరో కుమారుడు అయిన నాగ చైతన్య ‘జోష్ ’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎంతో ‘జోష్ ’తో అడుగు పెట్టిన కార్తీక కెరియర్ కూడా మంచి జోష్ లో సాగుతుందని అనుకున్నారు.
కానీ ఆ సినిమా అనుకున్నంత బ్రేక్ ఇవ్వకపోవడంతో కార్తీక అవకాశాలకు బ్రేకులు పడ్డాయి. ఆ సినిమా తరువాత తమిళం, తెలుగులో నటించిన ‘రంగం ’ సినిమా సూపర్ హిట్ తరువాతనైనా ఈమె కెరియర్ గాడిలో పడుతుందని అనుకున్నారు. అదీ జరగలేదు. ఆ తరువాత ఎన్టీఆర్ ‘దమ్ము ’ సినిమాలో ఛాన్స్ రావడంతో సుడి తిరుగుతుందని అనుకుంది. ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో ఈమెకు అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. ఇటీవల చాలా కాలం తరువాత సంతోష్ శివన్ దర్శకత్వంలో మకరమంజు సినిమాలో అవకాశం వచ్చింది.
ఈ సినిమా ట్రైలర్ మంచి టాక్ టెచ్చుకోవడంతో ఈ సినిమా పై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో లైమ్ టైం లోకి రావాలంటే ఎలా ? ప్రస్తుతం దీనిపైనే కసరత్తు చేస్తోందట అమ్మడు. టాలీవుడ్ అగ్రహీరోల సినిమాలో ఐటెం నెంబర్ తో విరుచుపడితే కొత్త క్రేజ్ వస్తుందని భావిస్తుందట కార్తిక. ఎవరైనా స్టార్ హీరో అవకాశం ఇస్తే స్పెషల్ ఐటెం నెంబర్ల తో ఆకట్టుకోవడానికి సిద్దంగా ఉన్నదట.
కార్తీక సై అనాలే కానీ, ఐటెం నెంబర్ గా ఆమెకు చాన్సులు ఇవ్వనిది ఎవరు ? రాధా పై అభిమానంతోనైనా దర్శకనిర్మాతలు ఓ ఆకాశం ఇవ్వడం ఖాయం. అలా రెండో ఇన్నింగ్స్ లో షైన్ అయ్యి, మరి ఐటెం గాళ్ గానైనా పేరు తెచ్చుకుంటుందో చూడాలి.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more