(Image source from: anchor rashmi got 10 lakh followers in social networking websites)
ప్రస్తుత ‘‘జబర్దస్త్’’ కామెడీ షో ద్వారా బుల్లితెర యాంకర్ గా పాపులర్ అయిన యాంకర్ రష్మీ దెబ్బకు అనసూయ ఔటయిపోయినట్లు తెలుస్తోంది. పొట్టిపొట్టి డ్రెస్సులతో తన హాట్ అందాలను ప్రేక్షకులకు కనువిందు చేయించిన అనసూయ ఎంత పేరు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే! అయితే ఇప్పుడు ఆమెకు చెక్ పెడుతూ యాంకర్ రష్మీ కూడా పొట్టిపొట్టి డ్రెస్సులతో తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ అనసూయకు మించిన ఫ్యాన్స్ ను పొగేసుకుంది. ఈమె షోలో కనిపిస్తే చాలు... కుర్రాళ్లంతా అలాగే చూస్తుండిపోతారు. తన గ్లామ్, ఛార్మ్ తో ఇతర యాంకర్లకంటే ముందుకు దూసుకుపోతోంది. ఇంతవరకు యాంకర్ అనసూయనే టాప్ ప్లేస్ లో వుందనే భావనను ఈ అమ్మడు తుడిచిపెట్టిసినట్లు కనిపిస్తోంది.
తాజా లెక్కల ప్రకారం.. యాంకర్ రష్మీ సామాజిక వెబ్ సైట్ లో నిత్యం 10లక్షల మంది ఫాలోవర్స్ వెంటాడుతున్నారని తెలిసింది. ఈ ఏడాది తొలినాళ్లలో ప్రారంభమైన ఆమె అఫీషియల్ వెబ్ సైట్ ను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య నానాటికీ శరవేగంగా పెరిగిపోతోందని సమాచారం! రాబోయే రోజుల్లో ఈ సంఖ్యం రెండింతలైనా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో.. అతి తక్కువ కాలంలోనే అత్యధికంగా ఫాలోవర్లను దక్కించుకున్న వారి జాబితాల్లోకి రష్మీ కూడా చేరిపోయింది. అన్నట్టు సౌత్ ఇండస్ట్రీలో వున్న చాలామంది సీనియర్ హీరోయిన్లకు ఇంతమంది ఫాలోయర్స్ లేరని లెక్కలు చెబుతున్నాయి. జబర్దస్త్ కామెడీ షో సక్సెస్ కావడానికి ఈ అమ్మడి పాత్ర కూడా చాలావరకే వుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ షో 75 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.
గతంలో ఈ అమ్మడు పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని అభిమానుల విమర్శలదాడికి గురైన సంగతి తెలిసిందే! అప్పట్లో ఆమె మీద ప్రతిఒక్కరు బూతు కామెంట్లు బాగానే విసిరారు. కానీ అందుకు తగ్గట్టుగానే రష్మీ కూడా బాగానే సమాధానమిచ్చింది. ఏదేమైనా.. యాంకర్ రష్మీకి కూడా హీరోయిన్ రేంజిలో 10మంది అభిమానులు వుండటం నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. మొదట కథానాయికగా నిరూపించుకోవాలని పరిశ్రమలోకి వచ్చిన ఈ అమ్మడికి ఆఫర్లు లభించక ఇలా బుల్లితెరపైకి వెళ్లాల్సి వచ్చింది. ఇంకొక విషయం ఏమిటంటే.. ఈ అమ్మడు ఒక తమిళ సినిమాలో నటించింది. ఆ మూవీ ఇంకా విడుదల కాలేదు.
ఇదిలావుండగా... యాంకర్ రష్మీకి 10 లక్షల మంది ఫాలోవర్లు వుండటంతో అనసూయ ఇమేజ్ రానురాను డ్యామేజ్ అవుతోందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు అనసూయ యాంకరింగ్ తోపాటు జడ్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆమెకి అంతగా ఫాలోవర్స్ లేరని... కానీ వచ్చిన కొన్నిరోజుల్లోనే యాంకరింగ్ చేస్తూనే రష్మీ ఇంతమందిని పొగేసుకోవడం గొప్ప విశేషమేనని ఆమెకి కితాబిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more