(Image source from: the reason behind why renu desai praises pawan kalyan on facebook)
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తాను దర్శకత్వం వహించిన ‘‘ఇష్క్ వాలా లవ్’’ మూవీ ట్రైలర్ ను విడుదల చేస్తున్నందుకు ఆ దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానంటూ రేణుదేశాయ్ ఫేస్ బుక్ లో పవన్ ను పొగిడిన విషయం తెలిసిందే! అలాగే చిత్రనిర్మాణంలో పవన్ తనకు ఎంతగానో సహాయం చేశాడని.. పవన్ లాంటి మంచి టీచర్ ను తన జీవితంలో మరెవ్వరినీ చూడలేదంటూ పేర్కొంది. ఫిల్మ పరిపూర్ణతను సాధించడానికి సహకరించిన పవన్ కల్యాణ్ కు తానెప్పుడూ రుణపడి వుంటానని స్పష్టం చేసింది. తాను ఈ విధంగా చెప్పిన కామెంట్లను పవన్ కల్యాణ్ కు వినిపించినప్పుడు అతను కూడా నవ్వి ఊరుకున్నాడంటూ ఆమె అందులో తెలిపింది. ఏదైతేనేం.. రేణుదేశాయ్, పవన్ కల్యాణ్ ను ఇంతలా పొగడడాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రేణు దేశాయ్ మరాఠీ భాషలో ‘‘ఇష్క్ వాలా లవ్’’ అనే చిత్రానికి మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే! ఈ మూవీ టీజర్ ను ఆగస్టు 26న రిలీజ్ చేయాల్సి వున్నప్పటికీ.. కొన్ని అనివార్యకారణాల వల్ల పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది రేణు! అయితే ట్రైలర్ ను విడుదల చేస్తూ.. పవన్ ను పొగడ్తలతో ముంచేసింది. పవన్ తనకు ఒక మంచి గురువు అంటూ తెగ పొగిడేసింది. అయితే తన తాజా చిత్రం ప్రమోషన్ లో భాగంగా టాలీవుడ్ లో కూడా బాగా పాపులర్ అవ్వాలనే నేపథ్యంలోనే రేణుదేశాయ్ ఈవిధంగా పవన్ కల్యాణ్ పొగుడేస్తోందని ఇన్ సైడ్ టాక్ జోరుగా నడుస్తోంది. టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ ఫాలోయింగ్ ఎలా వుందో అందరికీ తెలిసిందే! పవన్ ఫాలోయింగ్ ను క్యాచ్ చేసుకోవడానికి తన చిత్రాన్ని టాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలనే ఆశాభావంతోనే పవన్ మీద ప్రశంసలు కురిపించిందని చర్చించుకుంటున్నారు.
అలాగే.. పవన్ కల్యాణ్ కు ఇతరులకు సహాయం చేయడం ఎప్పటికీ ముందుంటాడు. ఈ తరుణంలోనే రేణు దేశాయ్ అతనికి దగ్గరయ్యి.. తన సినిమాను టాలీవుడ్ లో ప్రమోట్ చేసుకుంటే ఇక్కడ కూడా కలెక్షన్లు బాగానే వస్తాయని రేణు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పవన్ ఆమె సినిమాకు మద్దతునిస్తే.. టాలీవుడ్ లో ఆటోమెటిక్ గా అది ప్రమోషన్ అయిపోతుంది. ఎందుకంటే పవన్ ఏది చేస్తే.. ఆయన అభిమానులు కూడా అదే చేస్తారు. పవన్ ఈ సినిమాకు మద్దతు పలికితే.. అభిమానులు ప్రమోషన్ చేస్తారు. పైగా రేణు చేసిన కామెంట్లకు పవన్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి రేణు దేశాయ్ మంచి ఆలోచనే చేసిందంటూ సినీవిశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more