(Image source from: allu sirish posted a photo with his brother where they went for shopping to their upcoming movies)
ప్రస్తుతం టాలీవుడ్ మెగాబ్రదర్స్ అయిన అల్లు అర్జున్, అల్లు శిరీష్ లకు సంబంధించిన కొన్ని రహస్య విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ విషయాలను స్వయంగా అల్లు శిరీష్ తన అభిమానులతో పంచుకున్నాడు. తెరవెనుక తాము చేసే కొన్ని విషయాల గురించి శిరీష్ ట్విటర్ ద్వారా విశ్లేషించాడు. అలాగే తమ మధ్య వున్న సాన్నిహిత్యం గురించి కూడా తెలిపాడు.
ఏదైనా ఒక కొత్త సినిమాను మొదలుపెట్టినప్పుడు అందుకు అవసరమయ్యే కాస్టూమ్స్ ను తీసుకోవడం కోసం శిరీష్, అర్జున్ లు ఇద్దరు కలిసి విదేశాలను వెళతారని.. అక్కడ వాళ్లిద్దరూ చాలా ఎంజాయ్ చేస్తారని తెలిపాడు. ప్రస్తుతం బన్నీ కొత్త సినిమాకు అవసరమయ్యే కాస్టూమ్స్ షాపింగ్ కోసం బన్నీ స్టైలిష్ట్ అయిన అశ్విన్ తోపాటు తామిద్దరు కలిసి దుబాయ్ వెళ్లినట్లు శిరీష్ ట్వీట్ చేశాడు. అందుకు సంబంధించి వారు ముగ్గురు కలిసి దిగిన ఒక ఫోటోను కూడా అప్ లోడ్ చేశాడు. షాపింగ్ అనంతరం వారు ముగ్గురు ఒక హోటల్ లో కూర్చుని వున్న ఫోటోను శిరీష్ పోస్ట్ చేశాడు. అలాగే ‘‘ఆర్య-2’’ మూవీకోసం 2008లో ముగ్గురూ కలిసి షాపింగ్ కోసం దుబాయ్ కే వచ్చినట్లు తెలిపాడు.
అంతేకాదు.. బన్నీ గతంలో నటించిన ‘‘హ్యాపీ, దేశముదురు’’ సినిమాలకోసం కూడా వాళ్లిద్దరూ షాపింగ్ కోసం దుబాయ్ కి వచ్చామని పేర్కొన్నాడు. అయితే అప్పట్లో స్టైలిష్ట్ లు వుండేవారు కాదని.. ఆ సమయంలో వారిద్దరూ ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాళ్లని తెలిపాడు. తెరవెనుక తమ కుటుంబసభ్యులంతా కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తామని.. ఏ పార్టీ, ఫంక్షన్ కి వెళ్లినా అంతా కలిసే వెళ్తామని బన్నీ గతంలోనే ప్రకటించాడు. నిజజీవితంలో ఈ అన్నాదమ్ముల్లిద్దరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంటూ కొంతమంది సినీ ప్రముఖులు కూడా పేర్కొంటుంటారు.
ఇదిలావుండగా.. ‘‘జులాయి’’ తర్వాత బన్నీ మరోసారి త్రివిక్రమ్ తో కలిసి పని చేయనున్నాడు. త్వరలోనే వీరిద్దరి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే బన్నీ, శిరీష్ లు తమ మూవీ కాస్టూమ్స్ కోసం ఇలా దుబాయ్ షాపింగ్ కి వెళ్లాల్సి వచ్చింది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more