‘‘జబర్దస్త్’’ కామెడీ షో ద్వారా రాత్రికిరాత్రే లైమ్ లైట్ లోకి వచ్చేసిన హాట్ ఆంటీ యాంకర్ అనసూయ... ఓ వెలుగు వెలుగుతూ వస్తోంది. ఆ షోలో వున్న సందర్భంలోనే మూవీ అవకాశాల కోసం ట్రై చేసింది కానీ.. మంచి పాత్ర వున్న ఆఫర్ మాత్రం రాలేదు. అప్పుడప్పుడు స్టేజీ షోలలో హాట్ గా కనువిందు చేస్తూ కుర్రకార్లను తనవైపు తిప్పుకున్న ఈ యాంకరమ్మకు.. వరుసగా ఇతర ఛానెళ్లలో కూడా యాంకర్ గా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. తనమీద బూతు మాటలు ఎక్కువయ్యాయనే నేపథ్యంలో ‘‘జబర్దస్ట్’’ షో నుంచి బయటకొచ్చేసి.. ప్రస్తుతం మూడు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూ.. ఆన్ లైన్ లో వచ్చే కిరాక్ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
ఈ షోలతోపాటు కొన్ని ఆడియో ఫంక్షన్లలో కూడా వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ఇప్పటికే ఈ అమ్మడు బాగానే డబ్బులు జమ చేసుకుంది. ఏ యాంకర్ కు లేని క్రేజీని సొంతం చేసుకోవడంపాటు రెమ్యునరేషన్ స్థాయిని పెంచుకుంటూ పోయింది. ఇంత డబ్బులు తాన వెనకేసుకున్నప్పటికీ తాజాగా ఈ అమ్మడు కోటి రూపాయలకు మూడునెలలపాటు అమ్ముడుపోయిందని వార్తలు పుకార్లు చేస్తున్నాయి. మరీ తప్పుగా అర్థం చేసుకోకండి... ఇన్నాళ్లవరకు సినిమా ఆఫర్లు కోసం ట్రై చేసిన ఈ హాట్ ఆంటీని.. ఒక మూవీ ఆఫర్ ఈమెనే వెతుక్కుంటూ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆనాడు తన హాట్ అందాలను చూపిస్తూ కుర్రకారులను తన బుట్టలో పడేసుకున్న ఈ అమ్మడికి పవన్ కల్యాణ్ ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో ఐటెంగర్ల్ గా ఆఫర్ వచ్చింది. అయితే తాను కేవలం మంచి పాత్రల్లో మాత్రమే నటిస్తానని దానిని తిరస్కరించింది. ఆమధ్య ఒక సినిమాలో చిన్నపాత్ర చేసినప్పటికీ.. అది అంతగా గుర్తింపు ఇవ్వలేదు. దీంతో మళ్లీ ఏదైనా మంచి ఆఫర్ సొంతం చేసుకోవాలనే ఆకాంక్షతో ఈ అమ్మడు తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ.. అప్పుడప్పుడు ఫోటోషూట్ లు ఇస్తూ వచ్చింది. అలాగే చిత్రపరిశ్రమలో కూడా బాగానే చక్కర్లు కొడుతోందని వార్తలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే ఈ యాంకర్ కు ఓ ప్రొడ్యూసర్ ఈమెకి మూవీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఆమెకు కోటిరూపాయల వరకు పారితోషికం ఇవ్వడానిక్కూడా సిద్ధమయ్యాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వరుసగా టీవీ షోస్, ఈవెంట్లతో బిజీగా వున్న ఈ అమ్మడు.. సినిమాకోసం మూడునెలలపాటు డేట్స్ కేటాయించాలంటే కోటికి పైగా రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసినట్లు తాజా సమాచారం! అయితే ఈ విషయంలో ఎటువంటి నిజం లేదని ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నారు. మరి ఈ విషయం నిజమో, అబద్ధమో తెలియాలంటే.. అనసూయనే దీనిపై పెదవి విప్పాల్సి వుంటుంది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more