సావిత్రి.. ఈ పేరుకు కేవలం తెలుగుచలన చిత్రపరిశ్రమలోనే కాదు, యావత్తు దేశంమొత్తం మీద భారీగా డిమాండ్ వుంది. ఎందుకంటే ఆ పేరు వెనకాల ఓ చరిత్ర కూడా దాగి వుంది. అలనాటి సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఏకంగా యముడితోనే పోటిపడింది. దాంతో ఆమె చూపించిన ఆ ధైర్యానికి ఆమె పేరే తమ పిల్లలకు పెట్టుకోవాలని తల్లిదండ్రులు భావిస్తారు. ఇక, తెలుగు తెరపై హీరోయిన్ అయిన సావిత్రి కూడా తన నటన ప్రతిభతో అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. చిత్రపరిశ్రమలో ఆమె అందించిన సేవలకు ఆమె చిరకాలం నిలిచిపోయింది. ఇలా ఏ విధంగా చూసిన ‘‘సావిత్రి’’ అనే పేరుకు ఎక్కువ డిమాండే వుంది. అటువంటి పేరుతో ఒక సినిమాను తెరకెక్కిస్తే.. ఖచ్చితంగా హిట్ కొడుతుందని, ఆ సినిమాకు వచ్చే క్రేజే వేరుగా వుంటుందని దర్శకనిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. అందుకే.. ఇప్పుడు ఆ టైటిల్ కోసం ఏకంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, పవన్ లు గొడవపడుతున్నట్లు సమాచారం!
ఇప్పటికే వర్మ ‘‘సావిత్రి’’ పేరు మీద తన స్కూల్ ఇంగ్లీష్ టీచర్ కు, తనకు మధ్య రిలేషన్ గురించి సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! ఇదివరకే రిలీజైన ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా నెటిజన్లను బాగానే ఆకట్టుకున్నాయి. చాలా హాట్ హాట్ గా వున్న ఆ పోస్టర్లు అందరినీ పిచ్చెక్కించడంతో యూత్ నుంచి మంచి స్పందనే రాబట్టుకున్నాయి. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ‘‘సావిత్రి’’ అనే టైటిల్ హక్కులు తమ వద్ద వున్నాయంటూ పవన్, ఆయన నిర్మాత తిరుమల శెట్టి వాదనలు వినిపిస్తున్నారు. నారా రోహిత్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కించబోయే తమ సినిమాకోసం ‘‘సావిత్రి’’ అనే టైటిల్ నిర్ణయించుకున్నట్లు నిర్మాత తిరుమల తెలిపారు. మొదట ఫిల్మ్ ఛాంబర్ లో ఈ టైటిల్ ను సురేష్ బాబు రిజిష్టర్ చేయించారని.. వారి అనుమతితో తాము ఆ టైటిల్ ను తీసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే ఇదే టైటిల్ ను రామ్ గోపాల్ వర్మ వాడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వర్మ తన టైటిల్ ను మార్చుకోవాలంటూ నిర్మాత తన వాదనను వినిపిస్తున్నారు. లేకపోతే తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదివరకే రిజిష్టర్ చేసుకున్న టైటిల్ ను ఇతరులు ఎలా వాడుకుంటారని.. సీనియర్ దర్శకుడు వర్మకు ఇలా టైటిల్ ను దొంగలించడం సబబు కాదనే విషయం తెలియదా అంటూ వారు తెలుపుతున్నారు. దీంతో ఈ టైటిల్ గొడవ తారాస్థాయికి చేరేలా వుంది. అయితే రాంగోపాల్ వర్మ మాత్రం ఈ విషయం మీద పెదవి విప్పడం లేదు. గతంలో చాలా సినిమాలకు ఇలా టైటిల్ విషయంలో సమస్యలు ఏర్పడ్డాయి. అప్పుడు దర్శకనిర్మాతలు, హీరోలు టైటిల్ ముందు తమ పేరు వేసుకుని వివాదానికి ముగింపు పలికారు. ఇప్పుడు ‘సావిత్రి’ విషయంలో ఎటువంటి మార్పులు, చేర్పులు జరుగుతాయో? వర్మ తన టైటిల్ ను మార్చుకుంటారా..? లేదా నిర్మాతనే వెనక్కు తగ్గుతారా..? ఈ విషయాలు తెలియాలంటే కొన్నాళ్లవరకు ఆగాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more