తమిళంలో అజిత్ కు ఉన్న పాపులారిటి గురించి తెలియనిది కాదు. ఎవర్ గ్రీన్, కొన్ని పాత్రలకు రోల్ మోడల్ యాక్టర్ గా అజిత్ పేరు తెచ్చుకున్నారు. అలాంటి అజిత్ మరోసారి తనలోని నటన ప్రతిభను అభిమానులకు చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన తాజా చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడట. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అజిత్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్ రోల్స్ పోషిస్తున్నట్లు కోలీవుడ్ నుంచి సమాచారం వస్తోంది. ప్రతి పాత్ర కూడా వేర్వేరుగా ఉంటాయట. అజిత్ లోని నటుడి కోసం డైరెక్టర్ ప్రత్యేకంగా ఈ పాత్రలను అలా డిజైన్ చేశారని తెలుస్తోంది.
ఏకపాత్రాభినయంతోనే అదరగొట్టిన అజిత్ ఇప్పుడు మూడు క్యారెక్టర్లు అవి కూడా డిఫరెంట్ అంటే ఇంక ఏమి చెప్పనక్కర్లేదు అని తమిళ సినీ ప్రముఖులు అంటున్నారు. అజిత్ కు ఉన్న ఆదరణతో పాటు వెరైటి కాన్సెప్టుతో సినిమా వస్తుండటంతో ఖచ్చితంగా హిట్ అవుతుంది అని భావిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న నటుడుగా పేరుపొందిన అజిత్ వెరైటి క్యారెక్టర్లు చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. గతంలో కూడా డిఫరెంట్ కధలు, వెరైటి క్యారెక్టర్లు ఉండే సినిమాల్లో నటించారు. అందువల్లే తమిళనాట అజిత్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు తీస్తున్న డైరెక్టర్ గౌతమ్ మీనన్ త్వరలోనే మరో తెలుగు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అటు చాలా కాలం క్రితం తెలుగు తెరపై మెరిసిన తమిళ స్టార్ కూడ త్వరలోనే మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల కోసం వస్తున్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే హీరోగా కాకుండా స్పెషల్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా వివరాలు మాత్రం బయటకు వెల్లడి కాలేదు. ప్రస్తుతం గౌతమ్ తో చేస్తున్న సినిమా పూర్తయితే మిగతా ప్రాజెక్టులపై అజిత్ దృష్టిపెడతారని కోలివుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more