కలువ కళ్ళ భామ ‘శృతిహాసన్’ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగి ఉంది. నటిగా, గాయనిగా.., డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇలా పలు రంగాల్లో తన ప్రతిభ చూపుతూ ఆల్ రౌండర్ అన్పించుకుంటోంది. ఇక హీరోయిన్ ప్రస్థానం గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అంతటివాడే అమ్మడిని చూసి ‘ఆకాశం అమ్మాయైతే అంటూ పాట పాడాడు...’ అంతటి సొగసులు శృతి సొంతం. ఈ మద్య ఈ గుమ్మ ‘ఆగడు’లో చేసిన స్పెషల్ సాంగ్ తెగ పాపులర్ అయింది. సినిమా పెద్దగా ఆడకపోయినా ఈ పాటలో శృతి మాత్రం బాగా ఆడింది. ప్రేక్షకులు కూడా ఈ పాటను ఎంజాయ్ చేశారనే చెప్పాలి.
ఈ పాపులారిటీ తెలుసుకున్న యంగ్ టైగర్ అమ్మడి కోసం అదేపనిగా ఎదురు చూస్తున్నాడట. ఒక్కసారయినా శృతితో స్టెప్పేయాలని తెగ ఆరాటపడుతున్నాడు. మాస్ మెచ్చిన హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రూపొందుతున్న సినిమాలో కమల్ కూతురు కనబడితే కిక్కుంటుంది అనుకుంటున్నాడు. ‘ఆగడు’లో అందాలు, ప్రేక్షకుల ఆదరణ చూసి తనతో కూడా కలిసి డాన్స్ చేయాలి అని కోరుతున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇంతగా బ్రతిమిలాడితే తప్పుతుందా అనుకుంటోందట. అయితే ఏ మాత్రం ముట్టచెబుతారు అనే దగ్గరే కాస్త బెట్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఎందుకంటే ఫ్యూచర్ ప్రాజెక్టులు చాలా పీక్ స్టేజిలో ఉన్న సమయంలో ఇలా ఒక పాట కోసం అన్నీ అప్పగించాలి అనుకుంటే తప్పదు కదా అంటోంది.
ఒకప్పుడు ఐటం సాంగులకు ప్రత్యేకంగా ఉన్న భామలను పెట్టి ఆడించేవారు. అయితే వారి ఎక్స్ పోజింగ్ ఎక్కువయి కొన్నిసార్లు ఎబ్బెట్టుగా అన్పించేది. దీంతో కొత్త లుక్ మరియు పబ్లిసిటీ కోసం హీరోయిన్లను తీసుకువచ్చి స్పెషల్ సాంగ్స్ అంటున్నారు. మిగతావారికి ఏమో కాని దీని వల్ల శృతి మాత్రం బాగానే లాభపడుతోంది. ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు ఇలా స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తోంది. అయతే ఇది కెరీర్ కు ప్లస్ అయితే సంతోషమే కాని... తిప్పి కొడితే మాత్రం కోలుకోలేని దెబ్బతప్పదు.
పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. బండ్ల గణేష్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.., అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో తారక్ ది పవర్ ఫుల్ పోలిస్ క్యారెక్టర్ అని పూరి చెప్పారు. ఇప్పటికే పొలిస్ క్యారెక్టర్లు తెలుగు ప్రేక్షకులకు బోర్ కొట్టినా పూరి మార్కు కావటంతో నచ్చుతుంది అని అంటున్నారు. ‘రభస’ ఫ్లాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఎన్టీఆర్, నందమూరి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more