గతంలో కలర్స్ స్వాతి రహస్యంగా బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తోందని, రాత్రింబవళ్లు ఎవరికీ తెలియకుండా పార్టీలకు - పబ్బులకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసిందనే వార్తలు ఎన్నో వచ్చాయి. ఈమె నటించిన సినిమాలకంటే గాసిప్స్ వార్తలే లెక్కలేనన్ని వున్నాయి. మొదట్లో ఈ విషయాలను కామన్ గానే తీసుకున్న ఈ అమ్మడు.. రానురాను మరీ ఎక్కువగా పెరిగిపోతుండటంతో తీవ్రంగా ఖండించింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయలేదని.. ఇంతవరకు అసలు లవ్ లోనే పడలేదని చెబుతూ.. తనపై వచ్చి లవ్ ఎఫైర్ల ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తన పెళ్లి విషయం తల్లిదండ్రులే అప్పగించేశానని చెప్పిన ఈ అమ్మడు... అనవసరంగా ప్రేమ వ్యవహారాల్లో దూరనంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇంతవరకు బాగానే వుంది కానీ.. తాజాగా అమ్మడు ఒక హీరోతో కలిసి రెస్టారెంట్ లో ఎంజాయ్ చేసిందనే రూమర్లు మళ్లీ పుట్టుకొచ్చాయి. ఆ హీరో మరెవరో కాదు.. ఈమెతో కలిసి ‘‘స్వామిరారా’’ ప్రస్తుతం వస్తున్న ‘‘కార్తికేయ’’ సినిమాలో నటించిన నిఖిల్!
‘‘కార్తికేయ’’ సినిమా షూటింగ్ నేపథ్యంలో ఈ ఇద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారని, కలిసి రెస్టారెంట్లకు కూడా వెళుతున్నారని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఈ అమ్మడు ఆ రూమర్లను ఖండించింది. అయితే మరోసారి ఈ అమ్మడు ఆ హీరోతోనే కలిసి రెస్టారెంట్లో పట్టుబడినట్లు పుకార్లు జోరందుకున్నాయి. సినిమా షూటింగ్ నేపథ్యంలో లొకేషన్లలో ఇద్దరు కలిసి తిరగడం కామనేగానీ.. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఇద్దరికీ రెస్టారెంట్లో పని ఏముందని..? అందరూ ప్రశ్నించడం మొదలుపెట్టేశారు. ఆ ప్రశ్నలు రానురాను అనుమానాలుగా మారిపోయాయి. దీంతో అందరూ వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తున్నది నిజమేనంటూ ఫిక్స్ అయిపోయారు. ఇద్దరు లవ్ లో అంతగా మునిగిపోతే.. గతంలో వచ్చిన వార్తలను ఖండించాల్సిన అవసరమేముందంటూ ఎదురుప్రశ్న వేయడం మొదలుపెట్టేశారు.
అయితే ఈ వార్త అలా, ఇలా చక్కర్లు కొడుతూ చివరకు స్వాతి దగ్గరకి వచ్చిపడింది. దీంతో ఈ విషయంపై స్పందించిన అమ్మడు.. తాను హీరోతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లింది నిజమేనని ఒప్పేసుకుంది. కానీ.. తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదని.. సినిమా ప్రమోషన్ సందర్భంగానే అప్పుడప్పుడు రెస్టారెంట్లకు వచ్చేదని క్లారిటీ ఇచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే స్వాతి మాట్లాడుతూ.. ‘‘అసలు మేమిద్దరం షూటింగులో తప్ప మరెక్కడా కలసి తిరగలేదు. కార్తికేయ సినిమా ప్రమోషన్ కు మాత్రం నేను, నిఖిల్, దర్శకుడు కలసి ఒకే కారులో వెళ్లాం. అప్పుడు మధ్యలో రెస్టారెంటుకి వెళ్ళాల్సి వచ్చింది. అంతే... అది చూసి ఏవేవో కథలు అల్లేశారు. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. అతను నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే! మరేం లేదు" అంటూ చెప్పుకొచ్చింది కలర్స్ భామ!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more