లవర్ బాయ్ హీరో ఆది లేటెస్ట్ మూవీ ‘రఫ్’ ఈనెల 21న విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. అయితే ఎలాంటి ప్రమోషన్లు, యాడ్ లు లేకపోవటంతో సినిమా విడుదలపై అందరికి డౌట్ వచ్చింది. అంతా ఊహించినట్లే ఈ మూవీ 21న విడుదల కాలేదు. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 28న ‘రఫ్’ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. అయితే విడుదల ఎందుకు ఆగిపోయింది అనే ప్రశ్నకు సెన్సార్ లేట్ అని సమాధానం వస్తుంది. ఈనెల 20న ఈ మూవీకి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
దీంతో హడావుడిగా సినిమా విడుదల చేసే బదులుగా వచ్చే వారం విడుదల చేస్తే బెటర్ అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాయిదా వెనక మరో రీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. 21న మూడు సినిమాలు వస్తున్నాయి. దీనికి తోడు తాజాగా ‘నా బంగారు తల్లి’ కూడా ఇదే రోజున థియేటర్లకు వస్తుంది. అన్ని చిన్న సినిమాలే అయినా.., నలుగురి మద్య నలిగే కంటే.., ఒక్కరిగా రావటం బెటర్ అనుకుని సైలెంట్ గా సైడ్ అయిపోయినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. వచ్చేవారంకు ఈ నాలుగు సినిమాలు పాతబడటంతో.., ఫ్రెష్ గా వచ్చి ఫుల్ కలెక్షన్ వసూలు చేయవచ్చని కమర్షియల్ ఆలోచనతో ఇలా చేశారట.
శ్రీదేవి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఆది హీరోగా తెరకెక్కిన ‘రఫ్’ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వం వహించగా.., అభిలాష్ మాధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఆది కెరీర్ లో మరో లవ్ ఎంటర్ టైనర్ సినిమాగా ‘రఫ్’ నిలుస్తుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కోసం ఆది సిక్స్ ప్యాక్ బాడీ పెంచేశాడు. అన్ని హంగులు పూర్తి చేసుకుని 28న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more