ప్రేక్షకులను తన సినిమాలతో, సిని ప్రముఖులను కామెంట్లతో ఇబ్బంది పెట్టే రామ్ గోపాల్ వర్మ తాజాగా తన బుద్ధి చూపించారు. సినిమాల్లో వల్గారిటీని తెగ చూపించే రామ్ గోపాల్, నిజ జీవితంలో కూడా వల్గర్ బుద్దులు చాలాసార్లు చూపించాడు. తాజాగా వీ6 ఛానెల్ లో ప్రతీక నిర్వహిస్తున్న టీవీ షోలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మను అదృశ్యమయ్యే శక్తి ఇచ్చి వెళ్లమంటే ఎక్కడకు వెళ్తావు అని అడిగింది. దీనికి డైరెక్టర్ సమాధానం చెప్తూ లేడిస్ హాస్టల్ అన్నాడు. ఎందుకు అని ప్రశ్నిస్తే.., ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియకుండా చూడవచ్చు కదా అన్నాడు. ఈ మాటలతో ప్రతీక షాక్ అయింది.
ఇక ఆ తర్వాత అన్ని ఇలాంటి సమాధానాలే ఇచ్చాడు. స్నేహితులు అంటే ఎవరూ లేరని., శత్రువులు మాత్రం చాలామంది ఉన్నారని కాని వారి పేర్లు మాత్రం చెప్పనన్నాడు. ఇక ప్రస్తుతం ఫేవరెట్ యాక్టర్లు ఎవరూ లేరన్నాడు. రాజకీయ నేతలు ఎవరూ ఇష్టం లేదని... ఓటింగ్ పై నమ్మకం లేదని కామెంట్ చేశాడు. ఇంతకీ నువు ఏం నమ్ముతావు అని ప్రశ్నిస్తే.., ఏమి నమ్మను అని సమాధానం ఇచ్చాడు. ఇదేమి కొత్త కాదు అనుకుంటున్నారు కదా..., ఇక్కడే అసలు పంచ్ మొదలయింది. ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ కామెంట్లు ఇస్తే., ఇక మిగతా పార్ట్ అంతా ప్రతిక పంచ్ లు వేసి వదిలిపెట్టింది.
ధనాధన్ మంటూ ప్రశ్నలు సంధిస్తే.., వాటికి పూర్తిగా సమాధానాలు చెప్పలేక రామ్ గోపాల్ వర్మ చాలా ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా డైరెక్టర్, కాంట్రవర్సీ మెన్ అనే భయం ఏమాత్రం లేకుండా.. ఆర్జీవీ చెప్పు, నువ్వు అంటూ సింగ్లర్ పదాలు వాడింది. ఈ మాటలు రామ్ ను బాగా ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. ఇతరుల ఈగోలు హర్ట్ చేసి పండగ చేసుకునే వర్మకు వీ6 షో చుక్కలు చూపించింది. అటు చీటికి మాటికి తెలంగాణను నెత్తికెత్తుకుంటున్న రామును నిఖార్సయిన తెలంగాణ చానెల్ నిద్రలేకుండా చేసింది అని కామెంట్లు వస్తున్నాయి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more