హీరోయిన్లు ఎక్కువ కాలం ఇండస్ర్టీలో ఉండాలన్నా.., ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగాలన్నా పాటించాల్సిన సక్సెస్ మంత్ర ఒకటే.. అదే గ్లామర్. ఈ సూత్రం పాటిస్తే సినిమా చాన్సులు రావటం ఖాయం. అందాల ఆరబోతను మొదలు పెట్టిన ఎందరో ముద్దుగుమ్మలు సినిమా చాన్సులు కొట్టేసి దూసుకెళ్తున్నారు. అలా కాకుండా దాచుకున్నవారు అరకొర ఆఫర్లతో నెట్టుకొస్తున్నారు. ఈ రెండు విషయాలు గుర్తించిన బెంగళూరు భామ ప్రణిత స్కిన్ షోకు ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. తమిళ సినిమా నుంచి ఫ్యాన్స్ కు హీటు పెంచుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
‘బావ’ సినిమాతో ఇండస్ర్టీకి వచ్చి హోమ్లీ గర్ల్ గా పేరుతెచ్చుకున్న ప్రణీత, ‘అత్తారింటికి దారేది’తో పాపులర్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హీరోయిన్ అంటే ఆఫర్లు పరిగెత్తుకుంటూ రావాలి. కానీ ప్రణికి మాత్రం ఆ స్థాయిలో తాకిడి లేదు. వచ్చిన వాటిలో కూడా కొన్ని మధ్యలోనే వెళ్లిపోతున్నాయి. దీంతో రీసెర్చ్ మొదలు పెట్టి.., ఫార్ములా బయటకు తీసింది. ఈ మద్య హాట్ స్టిల్స్ తో ఫొటో షూట్ చేయించుకుంది. చిన్ని చిన్ని బట్టల్లో ప్రణిత పోజులు చాలా ఘాటుగా ఉన్నాయి. ఈ ఫొటోలు హీటెక్కిస్తున్నాయని నెటిజన్లు కూడా అంటున్నారు.
సూర్య నటిస్తున్న ‘మాస్’ సినిమాలో ప్రణిత నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్లామర్ అప్పియరెన్స్ అక్కడే మొదలవుతుందని అంటున్నారు. అటు ఈ పొట్టి బట్టల ఫోటోలు ఆఫర్లు తేవటం ఖాయమని ప్రణిత ఆశిస్తోంది. తాజా ఫొటోలు చూసిన కోలీవుడ్ సిని ప్రముఖులు తమ ప్రాజెక్టుల్లో నటించమని కోరే అవకాశం ఉంది. స్కిన్ షోకు రెడి అని బయటకు చెప్పకపోయినా.., ఫోటోలు విడుదల చేసి.., కావాలంటే చేయడానికి సిద్దమని సంకేతాలు ఇస్తోంది. అందరికి వర్కవుటు అయిన ఈ ఫార్ములా ప్రణిత విషయంలోనూ పారుతుందా లేదా అనేది సినిమా విడుదల అయితే తెలుస్తుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more