ఎన్టీఆర్ ‘టెంపర్’ మూవీ ఫస్ట్ లుక్ రాకముందే లీకైన ఫోటోలు నెట్ లోకి వచ్చి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ ఫోటోలు లీకైన ఫోటోల మాదిరిగా ఉండకపోవచ్చు ముందు అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే దాదాపు లీకైన ఫోటోల్లాగే ఉన్నాయి. ఇంతకీ ఈ ఫోటోలు లీక్ చేసింది ఎవరో తెలుసా..,ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ అట. అంతేకాదు లీక్ అయింది ‘టెంపర్’ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇంటి నుంచే కావటం మరో షాకింగ్ న్యూస్. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఫస్ట్ లుక్ లీక్ విషయంపై విశ్వసనీయవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా నిర్మాత బండ్ల గణేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ ను భారీ ఎత్తున నిర్వహించి మార్కెటింగ్ చేసుకోవాలని ప్లాన్ చేశాడట. మూవీ యూనిట్ గోవా నుంచి రాగానే సినిమా ప్రమోషన్ పై దృష్టిపెట్టాలని ప్లాన్లు గీసుకున్నాడు. రెండ్రోజుల ముందు నుంచే హైప్ క్రియేట్ చేసి హల్ చల్ చేద్దామనుకున్నాడు. అయితే పోనీ వర్మ ఫోటోలు లీక్ చేసి బండ్లకు షాకిచ్చింది. పూరి కేవ్ (పూరీ జగన్నాధ్ ఇళ్ళు)కి వెళ్లిన పోనీ వర్మ ఫస్ట్ లుక్ ఫోటోలు చూసిందట. టెంపర్ లుక్ చూశాను.., స్టిల్స్ చాలా బాగున్నాయి అంటూ ఏకంగా ఫొటోలను పోస్ట్ చేసిందట. ఇంకేముంది నిమిషాల వ్యవధిలో అన్ని వెబ్ సైట్లలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ లీక్ అంటూ ఆ ఫోటోలు పోస్ట్ అయ్యాయి.
ఇంకేముంది ప్లాన్ మొత్తం రివర్స్ కావటంతో.., పోనీ వర్మపై గణేష్ కు చిర్రెత్తుకొచ్చిందట. ఇక ఎలాగూ లీక్ అయ్యాయి కాబట్టి.., రిలీజ్ ప్లాన్ మార్చుకుని మామూలుగా., నెట్ లో అప్ లోడ్ చేసేశారు. అయితే ఫోటోలు పూరికి తెలియకుండా పోనీ ఎలా తీసుకోగలుగుతుంది అని డౌట్లు వస్తున్నాయి. షూటింగ్ కు సంబంధించి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బండ్లకు ఝలక్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే పోనీ ఫోటోలు అప్ లోడ్ చేసినా పూరి ఏమనలేదు అని కొందరు.., పూరి వెనకుండి ఫొటోలు అప్ లోడ్ చేయించాడని ఇంకొందు అనుకుంటున్నారు.
కార్తిక్
(courtesy : express)
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more