మూడుపదుల వయస్సు దాటినా కూడా నేటి యువకథానాయికలతో పోటీపడుతూ తన చెరగని అందంతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటున్న అనుష్క శెట్టి.. ప్రస్తుతం ‘రుద్రమదేవి, బాహుబలి’ భారీ ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే! ఆ చిత్రాల్లో ఈ అమ్మడు ఎన్నడూలేని విధంగా స్టంట్స్, ఫైట్స్ చేస్తోంది. సదరు సన్నివేశాల్లో నటించేందుకు అనుష్క తన ఫిజిక్’ని బాగానే మెయింటెన్ చేస్తోంది. ఎక్కువ బరువు పెరగకుండా తనకిష్టమైన ఆహారాల్ని వదిలేయడంతోబాటు రెగ్యులర్ డైటింగ్ చేస్తోందట!
కానీ ఆ చిత్రాల షూటింగ్ అనంతరం ఆమె చేయబోయే తదితర చిత్రంకోసం మాత్రం బాగానే బలిసిపోతోందని సమాచారం! వివరాల్లోకి వెళ్తే.. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి త్వరలో అనుష్క కథానాయికగా ఓ చిత్రం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాలో ఈ మూడుపదుల భామ ద్విపాత్రాభినయం చేస్తోంది. అందులో ఓ పాత్రలో సన్నగానూ, మరోసాత్రలో ప్రస్తుతమున్న ఫిజిక్ కంటే రెండు రెట్లు ఎక్కువగా అంటే 100 కిలోలపైనే బరువు వుండాలట! ఈ విధంగా రెండుపాత్రల గురించి డైరెక్టర్ చెప్పగానే.. కాస్త ఇంట్రెస్టింగ్ వుందంటూ వెంటనే ఓకే అనేసిందట అమ్మడు.
అయితే ఇప్పుడున్న అనుష్క ఒక్కసారి 100 కిలోల బరువు పెరగటం అంత సాధ్యం కాదు.. పైగా తర్వాత బరువు తగ్గడం ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో డైరెక్టర్ ఆ బరువుపాత్రను ట్రిక్ కెమెరా కానీ, సీజీ ద్వారా కానీ మేనేజ్ చేద్దామని చెప్పాడట! కానీ అందుకు ఆ ముద్దుగుమ్మ అందుకు ఒప్పుకోవడం లేదట! ‘నేను నేచురల్’గానే బరువు పెరుగుతాను’ అంటూ పట్టుపట్టిందట! ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తవగానే ఇక బరువు పెంచే పనిలో పడుతుందని అంటున్నారు!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more