టాలీవుడ్ సీతమ్మగా పేరొందిన తెలుగు నటి అంజలి ఒక కమెడియన్’తో సీక్రెట్’గా వివాహం చేసుకుందని రూమర్లు తెగ షికార్లు చేస్తున్నారు. ఇదివరకే ఈ అమ్మడు ఒక బిజినెస్’మేన్’తో ప్రేమాయణం నడుపుతోందని కొన్నాళ్లు, తర్వాత మరికొన్నాళ్లవరకు ఓ హీరోతో తెగ జల్సాలు చేస్తోందని, అలాగే ఇండస్ట్రీలో మూవీ ఆఫర్లు రాకపోవడం వల్ల అంజలి లోలోపలే రహస్య కార్యకలాపాలు నడుపుతోందని.. ఇలా ఎన్నో రకాలుగా వార్తలు వస్తూనే వున్నాయి. ఇప్పుడు తాజాగా కమెడియన్’తో ప్రేమవివాహం చేసుకుందని ఫిలిం ఇండస్ట్రీలో జోరందుకున్నాయి. మొత్తానికి చూస్తుంటే.. నటి అంజలి వివాదాస్పదమైన రూమర్లకు కేరాఫ్ అడ్రస్’గా మారిపోయినట్లు తెలుస్తోంది.
ఎప్పుడూ ఏదో ఒక రూమర్’తో వార్తల్లో నిలుస్తూ వుండే అంజలి.. ఇప్పుడు తమిళ కమెడియన్ సతీష్’ను సీక్రెట్’గా వివాహం చేసుకుందని ఒక్కసారిగా ప్రచారాలు సాగుతున్నాయి. ఇటీవలే కమెడియన్’గా మంచి గుర్తింపు సాధించిన సతీష్.. పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు. అంతేకాదు.. రాబోయే రోజుల్లో బోలెడన్నీ సినిమాలతో బిజీగా కూడా వున్నాడని సమాచారం! ఈ నేపథ్యంలో ఆఫర్లు లేక సతమతమవుతున్న అంజలి.. కమెడియన్’గా ఊపుమీదున్న సతీష్’ని వివాహం చేసుకుందని గాసిప్స్ బయటికొచ్చాయి. అంతేకాదు.. త్వరలోనే అఫిషియల్ స్టేట్’మెంట్ కూడా రాబోతుందని చెప్పుకుంటున్నారు కూడా!
అయితే.. ఇదే విషయమై కమెడియన్ సతీష్’ను ప్రస్తావించగా.. ‘‘అసలు నేనింతవరకు అంజలిని ఒక్కసారి కూడా కలవలేదు. ఆమెను సినిమాలలో చూడడం తప్ప ఆమెతో అఫీషియల్’గా ఎటువంటి పరిచయమే లేదు. మరి, ఈ వార్తని ఎవరు పుట్టించారో!" అంటున్నాడు. మరోవైపు ఈ వార్తలపై నటి అంజలి మాత్రం ఏమీ స్పందించడం లేదు. ఆమె స్పందన కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఇదిలావుండగా.. ఆమె కెరీర్’ను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే కొంతమంది కావాలని ఇలా వ్యతిరేకంగా రూమర్లు సృష్టిస్తూ ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more