టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ వేడుకల కోసం దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఫ్యామిలీతో సహా దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న బాబుకు.., హైదరాబాద్ రాగానే బిగ్ ఆఫర్ ప్రకటించేందుకు పీవీపీ బ్యానర్ సిద్దమవుతోంది. మహేష్ బాబు తో ఏకంగా మూడు సినిమాలు చేసేందుకు పీవీపీ డిసైడ్ అయ్యారట. బాబు హైదరాబాద్ రాగానే, వెంటనే అగ్రిమెంటు కాగితాలు తెచ్చి సంతకాలు పెట్టించేసుకుంటారని చెప్తున్నారు. ఈ మేరకు డైరెక్టర్లతో కూడా ఇప్పటికే మాట్లాడి కథలు సిద్ధం చేసుకోవాలని సూచించాడట.
ప్రస్తుతం ఫిలింనగర్ లో ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ‘ఆగడు’ ఫెయిల్యూర్ తర్వాత రెండు నెలలు గ్యాప్ తీసుకుని సినిమా మొదలు పెట్టిన మహేష్ కు ఇబ్బందులు తప్పలేదు. ప్రారంభంలోనే సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్ళీ కాస్త కుదురుకుంది. మొత్తానికి గతేడాది బ్యాడ్ గా సాగితే.., ఈ సంవత్సరం ప్రారంభంలోనే శుభవార్తలు విన్పిస్తున్నాయి. పీవీపీ బ్యానర్ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నా, మహేష్ ఏమంటాడో తెలియాల్సి ఉంది. మహేష్ సినిమాల విషయానికి వస్తే.., ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. దీనికి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
ఈ మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో ‘బ్రహ్మోత్సవం’ అనే సినిమా చేయాల్సి ఉంది. ఒకవేళ పీవీపీ ప్రాజెక్టు ఓకే అయితే ‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేష్ మూవీ ఉంటుంది. అటు పీవీపీ బ్యానర్ విషయానికి వస్తే.., బెంగళూరు డేస్ అనే సినిమా చేస్తుంది. దీనికి తోడు నాగార్జున, కార్తి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా కూడా చేస్తున్నారు. అటు అనుష్క హీరోయిన్ గా త్వరలో వచ్చే మరో లేడి ఓరియంటెడ్ మూవీ కూడా వీరి బ్యానర్ లోనే తెరకెక్కనుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more