సీబీఐ ఆఫీసర్ గా అవినీతిపరుల ఆటకట్టించే కథతో వస్తున్న ‘ఎన్.బి.కే.లయన్’ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన ఈ మూవీ టీజర్ బాగా ఆకట్టుకుంది. వచ్చే నెలలో లేదా మార్చిలో ఈ మూవీ విడుదల కానుంది. మొత్తానికి ఈ ప్రాజెక్టు గురించి అప్ డేట్స్ ఇలా ఉన్నాయి. 98వ సినిమా తర్వాత ఏమిటి పరిస్థితి అని ఎంక్వయిరీ చేస్తే.., బాలయ్య అసలు గ్యాపు తీసుకోకుండా సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. 98వ సినిమా కొద్ది రోజుల్లో పూర్తి కావస్తుండగా.., వచ్చే నెలలోనే 99వ సినిమా ప్రారంభం అవుతుందట.
‘లౌక్యం’ సినిమాతో అందరికీ ఎంటర్ టైన్ మెంట్ పంచి.., లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీ వాస్ బాలయ్య 99వ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవికి కథను సిద్దం చేసుకున్న వాసు.., తుది మెరుగులు దిద్దతున్నాడట. ఇక గోపి మోహన్, కోన వెంకట్ కలిసి పవర్ ఫుల్ డైలాగులు అందించేందుకు బాగా మైండ్ వాడుతున్నారట. పంచ్ డైలాగుల కేరాఫ్ గా మారిన వీరిద్దరూ.., బాలయ్యకు సూట్ అయ్యేలా మాటలు అందించటంపై కాన్ సెన్ ట్రేట్ చేశారట. నందమూరి హీరో కోసం తొలి సారి పనిచేస్తుండంటంతో తామేంటో చూపించేందుకు మైండ్ వాడుతున్నారు.
వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం అవుతున్న 99వ సినిమా బాలయ్య మార్కు పొలిటికల్ అండ్ సోషల్ మెసేజ్ మూవీలా ఉంటుందా లేక, వాసు మార్కు కామెడి ఎంటర్ టైనర్ గా ఉంటుందా.., ఈ రెండు కాకుండా కోన వెంకట్ లాంటి పంచ్ డైలాగ్ మూవీగా వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more