కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘పటాస్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే! మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్’గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం.. మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ చిత్రం దాదాపు రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టిందని అంచనా వేస్తున్నారు. గతకొన్నాళ్ల నుంచి ఒక్క హిట్ లేక ఆందోళనల్లో మునిగిన కళ్యాణ్’కి ‘పటాస్’ చిత్రం ఘనవిజయాన్ని అందించిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావుపూడికి మంచి మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం మార్కెట్’లో నడుస్తున్న సినిమాలన్నింటికంటే ఈ ‘పటాస్’ మూవీ భారీ విజయాన్ని అందుకుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర హౌస్’ఫుల్ బోర్డుతో ప్రదర్శించబడిన ఈ చిత్రం.. అలాగే తన ప్రభంజనాన్ని కొనసాగిస్తే దీని ప్రభావం ఇతర మూవీలపై పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా ‘గోపాల గోపాల’, శంకర్ ‘ఐ’ చిత్రం వసూళ్లు పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు వున్నాయని భావిస్తున్నారు. నిజానికి ‘గోపాల గోపాల’ మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ 40 కోట్లకుపైగా ఎక్కువ వసూళ్లను రాబట్టడంతో ఆ చిత్రం 50 కోట్ల క్లబ్’లోకి చేరడం ఖాయమని అంతా ఫిక్సయ్యారు. అలాగే ‘ఐ’ చిత్రం కూడా రూ.40 కోట్ల క్లబ్’లోకి చేరే అవకాశాలు వుండేవి. కానీ.. ‘పటాస్’ మూవీ రాకతో ఆ రెండు చిత్రాల థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. పైగా ఇది హిట్ టాక్ తెచ్చుకోవడంతో దీని ప్రభావం ఆ రెండు చిత్రాలపై తీవ్రంగా పడే అవకాశాలు వున్నాయి.
దీంతో ఆ రెండు చిత్రాల డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనల్లో మునిగిపోయారు. ఆ రెండు మూవీలపై భారీ డబ్బులు ముట్టజెప్పి మరీ కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లలో కొంతమందికి ఇంతవరకు ఖర్చుపెట్టిన డబ్బులు రాలేదు. దీంతో తమకు అందాల్సిన మొత్తమైన అందితే సేఫ్’గా బయటపడొచ్చనే ఆందోళనల్లో వుండిపోయారు. మరికొంతమందికి అందాల్సిన మొత్తం అందింది కానీ.. లాభం మాత్రం దక్కలేదు. ఏదిఏమైనా.. ‘పటాస్’ చిత్రంతో ‘ఐ’, ‘గోపాల గోపాల’ చిత్రాలకు కళ్యాణ్ పంచ్ వేసినట్లు కనిపిస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more