మూడుపదుల వయస్సు దాటిన హీరోయిన్లందరూ ఇండస్ట్రీ నుంచి క్రమంగా తప్పుకుంటుంటే.. బొమ్మాళీ అనుష్క మాత్రం వరుసగా మూవీలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయిపోతోంది. ఓవైపు ఈ అమ్మడు ఇంటివాళ్లు ఆమె పెళ్లి గురించి ఆలోచిస్తుంటే.. ఈ స్వీటీ మాత్రం తనకేమీ తెలియదన్నట్టుగా వచ్చిన ఆఫర్లన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. పైగా.. మరే హీరోయిన్ ఇంతవరకు సాధించని రికార్డులన్నింటికీ తన ఖాతాలో జమ చేసుకుంటోంది. ఇప్పటికే భారీ ప్రతిష్టాత్మక చిత్రాలైన ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. మరో అరుదైన ఘనతను పొందుతున్నట్లు సమాచారం!
తమిళంలో సూర్య హీరోగా వచ్చిన ‘సింగం’, ‘సింగం-2’ చిత్రాలు మంచి విజయాలను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే! ఆ రెండు మూవీల్లోనూ అనుష్క కథానాయికగా నటించింది. ఇక ఈ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హరి.. ‘సింగం-3’ని రూపొందించాలనే సన్నాహాల్లో వున్నట్లు చెన్నై ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇదివరకు వచ్చిన రెండు మూవీల్లోనూ సూర్య-అనుష్క జంట బాగా కుదరడంతోపాటు విజయాలను సాధించిన నేపథ్యంలో.. ఈ మూడో సీక్వెల్ మూవీలోనూ ఈ జంటనే తీసుకోవాలని దర్శకుడు నిర్ణయం తీసుకున్నాడట! దీంతో అతడు ఈ మూవీ స్ర్కిప్ట్’ను రెడీ చేసే పనిలో పడ్డాడు.
ఈ మూవీలోనూ సూర్య మళ్లీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్’గా నటిస్తుండగా.. అతనికి జోడీగా అనుష్క నటించనున్నట్లు సమాచారం! అయితే.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి వుంది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే.. ఒక సినిమా మూడు భాగాలలోనూ కథానాయికగా నటించిన క్రెడిట్ ఈ అమ్మడికే సొంతం అవుతుంది. ఇదిలావుండగా.. ఇటీవలే ఈ అమ్మడు తెలుగులోనూ ఓ మూవీ కమిట్ అయినట్లు వార్తలొస్తున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more