బాలీవుడ్’లో అత్యంత యువతార ఆలియాభట్ తన అందాలతో ఇప్పటికే పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! బాలీవుడ్ పెద్ద డైరెక్టర్ కూతురైనప్పటికీ.. ఎక్స్ పోజింగ్ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పూర్తిగా తన అందాలను ఆరబోస్తోంది. అంతేకాదు.. బెడ్ రూమ్ ఘాటు సన్నివేశాల్లో సైతం నటిస్తూ యువకుల మనసులను దోచేసుకుంటోంది. దీంతో.. అనతికాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పొందడంతో స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోయింది.
ఇంకొక విషయం ఏమిటంటే.. ఈ అమ్మడు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కవిధంగా తళుక్కుమంటూ మెరుస్తుంటుంది. ఓ సినిమాలో ఓ పాత్ర చేస్తే.. మరో సినిమాలో అందుకు భిన్నంగా చేస్తుంది. ఎందుకంటే.. ఒకే తరహా మూవీల్లో చేస్తే ప్రేక్షకులు బోర్’గా ఫీల్ అవుతారని, వారి కొత్తదనం కోసమే ప్రతీ మూవీకి తనను తాను మార్చుకుంటానంటూ ఈ అమ్మడు వెల్లడిస్తోంది. అందుకే.. తాను నటించబోయే ఓ మూవీకోసం ఈ అమ్మడు గతచిత్రాలకంటే కాస్త విభిన్నంగా కనిపించేందుకు కసరత్తులు చేస్తోందని సమాచారం!
బాలీవుడ్ సమాచారం ప్రకారం.. ఆలియా ‘బాడీ లాంగ్వేజ్’ కోర్సు చేయాలని నిర్ణయం తీసుకుంటుందట! ఇదివరకు తాను నటించిన సినిమాలన్నింటిలోనూ నాజుగ్గా, సన్నగా కనిపించిన ఈమె.. ఇప్పుడు కాస్త సెక్సీగా కనిపించేందుకు ఇలా నిర్ణయం తీసుకుందని అంటున్నారు. త్వరలోనే న్యూయార్క్ వెళ్లి, అక్కడ ఈ కోర్సులో శిక్షణ తీసుకోనుందని సమాచారం! అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు షాహిద్’తో నటించిన ‘షాందార్’ విడుదలకు సిద్ధంగా వుండగా.. మరో మూవీ షూటింగ్’లోనూ బిజీగా వుంది. ఆ మూవీ చిత్రీకరణ ముగిసిన వెంటనే అమెరికాకు వెళ్లి ఆ కోర్సులో జాయిన్ కానుందని ఇండస్ట్రీ టాక్! ఏదేమైనా.. ప్రేక్షకులను తనవైపు ఎలా తిప్పికువాలోనన్న విషయాన్ని ఆలియా త్వరగానే ఒంటబట్టేసుకుందని విశ్లేషకుల అభిప్రాయం.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more