ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఒక్క అవకాశం ఇవ్వడంటూ దర్శకనిర్మాతల చుట్టూ ‘బాబ్బాబ్బాబు’ అంటూ కొత్త తారలు వెంబడిస్తుంటారు. అదే వారికి రెండుమూడు విజయాలు వరిస్తే చాలు.. తమ చుట్టూ దర్శకనిర్మాతలను తిప్పుకుంటుంటారు. అంతేకాదు.. రకరకాల డిమాండ్లతోపాటు రెమ్యునరేషన్ కూడా పెంచేస్తారు. నిర్మాతలు కాస్త తగ్గించుకోమని ఎంతగా గింజుకున్నప్పటికీ.. తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా కొందరు తారలు వ్యవహరిస్తుంటారు. ‘ఇస్తే ఇవ్వండి.. ఛస్తే చావండి.. మొహమాటం పడేదిలేదు లేదు’ అంటూ తెగేసి చెబుతుంటారు. ప్రస్తుతం తెలుగ నటి శ్రీదివ్య కూడా ఇలాగే వ్యవహరిస్తోందని కోలీవుడ్ చెప్పుకుంటున్నారు.
‘బస్టాప్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ మూవీ సక్సెస్ సాధించడంతో ఈమెకు నటిగా కాస్త గుర్తింపు లభించింది. దీంతో ఈ అమ్మడికి తెలుగులో అంతగా ఆఫర్లు రాలేదు కానీ.. తమిళంలో మాత్రం వరుసగా ఛాన్సులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె అక్కడ ‘కాట్టుమల్లి’ అనే తొలిచిత్రాన్ని ఒప్పుకుంది. అయితే.. కొన్ని ఫైనాన్షియల్ కారణాల వల్ల ఆ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ మూవీ ఇంకా పూర్తి కాకుండానే దివ్య నటించిన మరో ఆరు సినిమాలు కూడా రిలీజైపోయాయి. అందులో కొన్ని భారీగా విజయం సాధించాయి. దీంతో ఈమె తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసింది. ప్రస్తుతం ఈ చిన్నది రూ.50 లక్షలు తీసుకుంటోందని సమాచారం!
ఇదిలావుండగా.. దివ్య నటించిన తొలిచిత్రం ‘కాట్టుమల్లి’ నిర్మాతలకు ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కాస్త ఊరట లభించడంతో ఆ మూవీ షూటింగ్ మళ్లీ కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు దివ్యకి డేట్స్ అడిగితే.. ప్రస్తుతం తనకున్న డిమాండ్ ప్రకారం 50 లక్షలు పారితోషికం ఇస్తేనే డేట్స్ ఇస్తానని తెగేసి చెప్పిందట! మొహమాటం పడేది లేదని, అడిగిందే ఇవ్వాలంటూ ఆమె మొండికేస్తోందని అంటున్నారు. దాంతో నిర్మాతలు లబోదిబోమంటూ ఆమెతో బేరాలాడుతున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈమె దిగివచ్చి తన రెమ్యునరేషన్ స్థాయిని తగ్గించుకుని ఆ నిర్మాతకు కృతజ్ఞత చెబుతుందో లేదో చూడాలి!
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more