ఇటీవలే కాలంలో సినిమా, క్రీడారంగంలో వున్నవారి మధ్య బంధాలు బాగానే పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ తంతు చాలాకాలం నుంచి నడుస్తూ వస్తోంది కానీ.. ఈ మధ్య ఈ రెండు రంగాల మధ్య రిలేషన్ మరింత చేరువవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ హాట్ భామ అనుష్క శర్మ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పీకల్లోతుదాకా ప్రేమలో మునిగిపోగా.. తాజాగా మరో హీరోయిన్ కూతురు ఓ క్రికెటర్ తో కొన్నాళ్ల నుంచి డేటింగ్ చేస్తోందని వార్తలొస్తున్నాయి.
ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రాధికకు 23 ఏళ్ల రయానే హార్డీ అనే కూతురు వుంది. రాధికాకు, ఆమె విడాకులు తీసుకున్న రెండో భర్త రిచార్డ్ హార్డీకి ఈమె జన్మించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ క్రికెట్ జట్టుకు సంబంధించిన యువ ఆటగాడు అభిమన్యు మిథున్ తో గతకొన్నాళ్ల నుంచి డేటింగ్ చేస్తోందని వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని పార్టీలకు, పబ్బులకు షికార్లు చేస్తున్నారని సమాచారం! అంతేకాదు.. స్టార్ హోటళ్లలో కూడా వీరిద్దరు కలిసి బస చేసినట్లుగా సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరిద్దరు కౌగిలించుకున్నట్లు, ముద్దుల ముచ్చట్లు కూడా తీర్చుకున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇదిలావుండగా.. ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇందుకు సంబంధించి రాధికా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందట! ఏదేమైనా.. ఇంకా ఇండస్ట్రీలోకి రాకముందే ఈ అమ్మడు ఓ క్రికెటర్ తో ప్రేమాయణం నడపుతూ వార్తల్లోకక్కేసింది. మరి.. వీరిద్దరి ప్రేమాయణం ఎన్నాళ్లవరకు కొనసాగుతుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more