సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి ఇటీవలే క్యాన్సిల్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా త్రిష మరియు త్రిష తల్లి ఉమా అధికారికంగా ప్రకటించినా కూడా మళ్లీ త్రిష పెళ్లిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు త్రిష పెళ్లి ఆగిపోయిందంటూ వార్తలొస్తే... ఇపుడేమో త్రిష తన సినిమాలను ఎందుకు వదులుకుంటుందోనని వార్తలొస్తున్నాయి. మొత్తానికి త్రిష మాత్రం ప్రతిరోజు వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతుంది.
వరుణ్ మాణియన్ తీయబోయే ఓ సినిమా నుంచి త్రిష తప్పుకుందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై త్రిష మాత్రం ‘అసలు ఈ సినిమా తాను ఒప్పకుంటేనే కదా తప్పుకోవడానికి’ అంటూ చెబుతోంది. అంటే వరుణ్ సినిమా త్రిష ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాజెక్టు హీరోయిన్ తాప్సీకి వరించింది. ఇదిలా వుంటే సెల్వ రాఘవన్ సినిమా నుంచి కూడా త్రిష తాజాగా తప్పుకుంది.
సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు, త్రిష హీరోహీరోయిన్లుగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కబోతుందనే విషయం తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లే సమయంలో... త్రిష ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. త్రిష ఈ ప్రాజెక్టు తప్పుకోవడానికి గల కారణం.. ఈ సినిమా నిర్మాత వరుణ్ మాణియన్ కు మంచి స్నేహితుడట. అందుకే భవిష్యత్తులో మళ్లీ ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భావించి త్రిష ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందంటూ వార్తలొస్తున్నాయి.
కానీ ఈ విషయంపై త్రిష స్పందన మరో విధంగా వుంది. సెల్వా తన ఫేవరెట్ దర్శకుడని, ఆయన సినిమాలో నటించడం తనకెప్పుడు సంతోషమేనని.. అయితే కాల్ షీట్స్ సమస్య కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నానని త్రిష తెలిపింది. మరోసారి సెల్వా దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని త్రిష చెబుతోంది. మరి ఇప్పటికైనా ఈ అమ్మడిపై వస్తున్న వార్తలు ఆగిపోతాయో లేదో చూడాలి.
ప్రస్తుతం తెలుగులో త్రిష నటించిన ‘లయన్’ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. అలాగే ఇటీవలే సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అరణ్మనై2’ సినిమాలో త్రిష ఓ ప్రధాన పాత్రలో నటించనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more