తెలుగు ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ పొందిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ‘మగధీర’ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ అమ్మడి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఈమెతో నటించేందుకు సీనియర్లతోపాటు జూనియర్ హీరోలు ఆసక్తి చూపారు. ప్రస్తుత రోజుల్లో ఈమె డిమాండ్ కాస్త తగ్గినప్పటికీ.. భారీ ఆఫర్లు బాగానే అందిపుచ్చుకుంటోంది. మూడుపదుల వయస్సు దాటినప్పటికీ ఇంకా చెదరని అందంతో అందరినీ మైమరిపిస్తున్న ఈ బొద్దుగుమ్మ మాయాజాలం ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే వుంది. అందుకే.. ఈమెతో చాలా సినిమాల్లో నటించి విజయాలు దక్కించుకున్న ఓ మెగాహీరో.. మరోసారి ఆమెతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ మెగాహీరో ఎవరని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. రామ్ చరణ్. ఈ మెగాహీరో నటించబోయే తదుపరి చిత్రంలో హీరోయిన్ గా ఈ అమ్మడినే ఎన్నుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళంలో తెరకెక్కిన ‘తని ఒరువన్’ చిత్రం భారీ విజయం సాధించడంతో దాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించనున్న ఈ రీమేక్ చిత్రంలో హీరోయిన్ గా కొందరు తారలను పరిశీలించారు. అయితే.. చివరగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చెర్రీ నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మిగతా షూటింగ్ అయిన వెంటనే ‘తని ఒరువన్’ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘బ్రూస్ లీ’ చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ దానయ్యే ‘తని ఒరువన్’ రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. అందుకే.. ఆయన అప్పుడు చరణ్ కథానాయకుడిగా కొత్త సినిమాకి సంబంధించిన సన్నాహాలు మొదలు పెట్టేశాడు. ఇప్పటికే ఈ రీమేక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో కథానాయికగా కాజల్ అగర్వాల్ ని సంప్రదిస్తున్నట్టు తెలిసింది. మరి.. ఈ ఆఫర్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే!
ఇదిలావుండగా.. గతంలో చరణ్, కాజల్ జోడీగా నటించిన ‘మగధీర’, ‘నాయక్’, ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాలు అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ‘మగధీర’ చిత్రం ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది. అందుకే.. చెర్రీతో నటించే అవకాశాలు వచ్చిన వెంటనే ఓకే చెప్పేసింది. ఈసారి కూడా ‘తని ఒరువన్’ రీమేక్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని వార్తలు బలంగా వినిపిస్తుంది. లెటజ్ వెయిట్ అండ్ సీ!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more