మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే వుద్దేశ్యంతో హిట్టు స్టోరీతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు చరణ్. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’ సినిమాను తెలుగులో రాంచరణ్ హీరోగా రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే.
తమిళంలో జయంరవి హీరోగా, ప్రముఖ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలలో నటించిన ‘తని ఒరువన్’ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యే విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకొని, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు.
రాంచరణ్ హీరోగా ప్రముఖ కమర్షియల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కనుంది. అయితే అరవింద్ స్వామి నటించిన విలన్ పాత్రలో ఎవరు నటిస్తారోననే ఉత్కంఠ ఏర్పడింది. ఈ పాత్రకోసం పలువురు నటుల పేర్లు కూడా వినిపించాయి. అయితే చివరకు ఈ ఉత్కంఠ వీడిపోయింది.
ఈ సినిమా తమిళంలో విలన్ గా నటించిన అరవింద్ స్వామియే ఈ రీమేక్ లో కూడా విలన్ గా నటించబోతున్నాడని తెలిసింది. ఇటీవలే ఈ చిత్ర నిర్మాతలు అరవింద్ స్వామిని కలిసి అడిగారని, అందుకు అరవింద్ స్వామి కూడా సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.
దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు పనుల్లో బిజీగా వున్నారు. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more