టాలీవుడ్ లో స్టార్ హీరోలంతా సినిమా సినిమాకు కొత్తదనం కోరుకుంటున్నారు. ప్రేక్షకుడికి కిక్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో రొటీన్ కి భిన్నంగా ఉండాలనుకుంటున్నారు. అందుకే సినిమా కథల్లోనే కాదు స్టైలింగ్ అన్నింటిలోనూ మేకోవర్ అవుతున్నారు. లేటెస్ట్ గా స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా మళ్లీ లవర్ బాయ్ గా కనిపించాలనుకుంటున్నారట.
హీరోగా పరిచయం అయ్యేటప్పుడు వారసులంతా లవర్ బాయ్ గా ప్రేక్షకుడి ముందుకు వస్తుంటారు. అలానే అల్లు అర్జున్ పలు సినిమాల్లో ప్రేమికుడిగా కనిపించాడు. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ హీరోగా మారాడు. తాజాగా బోయపాటి డైరక్షన్ లో మాస్ హీరోగా ప్రేక్షకులను మెప్పించాడు. రౌండ్ ద క్లాక్ అన్నట్లు ఇప్పుడు మళ్లీ ప్రేమ కావాలంటున్నాడట.
కొత్తదర్శకులకు అవకాశం ఇవ్వాలనుకుంటున్న అల్లు అర్జున్ ప్రేమకథలను తన కోసం రెడీ చేయమన్నాడట. ఈ విషయం తెలుసుకున్న సీనియర్లు కూడా పక్కా లవ్ స్టోరీని సిద్ధం చేస్తున్నారట. త్వరలో టర్కీ టూర్ ని ముగించుకొని వచ్చాక కొత్తసినిమాపై బన్నీ దృష్టిపెడతాడట.
ఇటు నందమూరి యంగ్ టైగర్ కూడా ప్రేమకథలపై మనసు పారేసుకున్నాడట. నిన్ను చూడాలని సినిమా తప్పించి ఆ తర్వాత పక్కా లవర్ బాయ్ గా కనిపించింది లేదు తారక్. మాస్ హీరోగా , కుటుంబకథా చిత్రాల్లో ఇప్పటివరకు ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్ ఇప్పుడు ప్రేమికుడిగా మారాలనుకుంటున్నాడట.
అందుకే, హనురాఘవపూడి సిద్ధం చేసిన లవర్ బాయ్ కథను వినబోతున్నాడట తారక్. ఈ కథ ఓకే చేస్తే జూనియర్ ని కూడ లవర్ బాయ్ గా చూడొచ్చు అంటున్నారు అందరూ.
- పరిటాల మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more