నందమూరి నటసింహం బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం మోక్షజ్ఞ బాలయ్య బాబు వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో క్లైమాక్స్ లో మోక్షజ్ఞ తెరపై కనిపించనున్నాడు. అయితే పూర్తి స్థాయి హీరోగా నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్యబాబు మోక్షజ్ఞకోసం ఒక కథని కూడ విన్నాడట. టాలీవుడ్ లో సన్సేషనల్ డైరెక్టర్ అయిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ వినిపించిన కథని బాలయ్యబాబు ఓకే చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో మోక్షజ్ఞ ని డైరెక్ట్ చేసేందుకు రాజమౌళి తనయుడు కార్తికేయని సిద్ధం చేస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్. ఇప్పుడు ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అతి త్వరలో ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు.
ప్రస్తుతం గౌతమిపుత్ర సినిమాతో బిజీగా ఉన్న బాలయ్యబాబు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఫినిష్ అయిన అనంతరం ఈసినిమాపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాహుబలి పార్ట్ 2 లో బిజీగా ఉన్న రాజమౌళి అండ్ టీమ్ కూడ ఆ సినిమా అవ్వగానే కార్తికేయని డైరెక్టర్ గా పరిచయం చేయాలనుకున్న సంగతి తెలిసిందే.
అయితే రాజమౌళి కూడ తన కొడుకుకి సరైన ఫ్లాట్ ఫాం కోసమే వెయిట్ చేస్తున్నాడని, ఇప్పుడు వీళ్లిద్దరు యంగ్ స్టార్స్ కలిస్తే సినిమాకి తిరుగు ఉండదని చెప్పుకుంటున్నారు అందరూ. ఏది ఏమైనా కుర్రాడి అరంగేట్రం అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య. 2019 ఎలక్షన్స్ కి ముందు పూర్తిస్థాయి రాజకీయాల్లో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి ఈలోపే మోక్షజ్ఞని గ్రాండ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు సినీ విశ్లేషకులు.
- పరిటాల మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more