టాలీవుడ్ లో చిన్న హీరోగా పరిచయం అయ్యి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగిన నాని వరుసహిట్స్ తో దూసుకుపోతున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమా నానికి మంచి మార్కెట్ ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ బిజినెస్ ని ఒక్కసారిగా పైకి లేపింది. ఈ సినిమాతో నాని మీద భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్స్ ఎక్కువైపోయారు.
తర్వాత వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమా కూడ మార్కెట్ పరంగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా నాని మార్కెట్ కి ఫ్లాట్ ఫామ్ అయ్యింది. ఇప్పుడు తాజాగా నాని నటిస్తున్న జెంటిల్ మెన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈసినిమా పై ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. సినిమా మంచి హిట్ టాక్ వస్తే ఓవర్సీస్ లో తిరుగులేని మార్కెట్ ఉంటుందని, ఎట్టిపరిస్ధితుల్లో సినిమా 50కోట్ల క్లబ్ లోకి వెళ్లిపోతుందని చెప్తున్నారు.
అయితే, ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం సినిమా మళ్లీ నాని మార్కెట్ ని డౌన్ చేసేస్తుందని, దీనివల్ల రాబోయే నాని సినిమాలపై దాని ప్రభావం కనిపిస్తుందని చెప్తున్నారు.
అయితే, ఈ సినిమా డైరెక్టర్ మంచి విషయమున్న మోహనకృష్ణ ఇంద్రగంటి కాబట్టి సినిమా ఖచ్చితంగా మంచి పాజిటివ్ టాక్ వస్తుందని, గతంలో మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాలు అన్నీ పాజిటివ్ టాక్ వచ్చినవే అని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాకుండా గతంలో ఈ డైరెక్టర్ నానికి అష్టాచమ్మా సినిమాతో లైఫ్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఆ రేంజ్ టాక్ వస్తే మాత్రం తప్పకుండా 50కోట్లు పైనే కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more