టాలీవుడ్ లో గత రెండు సంవత్సరాలుగా లెక్కలు మారుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీసు ముందు బోల్తా పడుతుంటే, చిన్న బడ్జెట్ తో తీసిన సినిమాలు ప్రొడ్యూసర్స్ కి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కామెడీ, థ్రిల్లర్స్, హారర్ సబ్జెట్స్ ని నమ్ముకుని సినిమా తీసిన దర్శక నిర్మాతలకు ఆ సినిమాలు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయని, ఈ విషయం మరోసారి రుజువైందని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. అవేవిటో ఒకసారి పరిశీలిస్తే...,
సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టిన మార్కెట్ తన తర్వాత వచ్చిన సినిమాలపై ప్రభావాన్ని చూపించిందని, ఆ సినిమా ఎఫెక్ట్ తోనే తన తర్వాత సినిమాలు కూడ మార్కెట్ లో నిలబడ్డాయని చెప్తున్నారు. బీరువా సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడ నష్టాలేమి తేకపోవడమే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.
ఇక 2015 లో వచ్చిన బుడుగు, దొంగాట సినిమాలు మంచులక్ష్మిని లాభాల బాట పట్టించాయి. తర్వాత పూరీ జగన్ సైతం ఛార్మితో తీసిన జ్యోతిలక్ష్మి బాక్సాఫీసు దగ్గర హిట్ అయ్యింది.
ఇక చిన్న యంగ్ హీరో నిఖిల్ శంకరాభరణం సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ సంవత్సరం వచ్చిన సుమంత్ అశ్విన్ కేరింత, రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్, అశ్విన్ రాజుగారి గది , సుధీర్ బాబు భలేమంచిరోజు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.
అలాగే, ఈ సంవత్సరం వచ్చిన సినిమాలు కూడ చిన్న నిర్మాతలకు, దర్శకులకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. గుంటూర్ టాకీస్ చిన్న బడ్జెట్ సినిమాల్లోనే సన్సేషనల్ హిట్ టాక్ తో బాక్సాఫీసుని కొల్లగొట్టింది. అడవిశేషు క్షణం సినిమా కూడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సంక్రాంతికి వచ్చిన శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా భారీ వసూళ్లను రాబట్టింది. వీళ్ల మధ్యలో నవీన్ చంద్ర లచ్చిందేవికి లెక్కుంది కూడ ఫర్వాలేదనిపించింది.
ఇప్పుడు ఈ సినిమాల లెక్కలను చూస్తునే పెద్ద నిర్మాతలు సైతం చిన్న బడ్జెట్ తో సినిమాలు తీసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గత పదిసంవత్సరాలుగా బాలీవుడ్ అనుసరిస్తున్న సక్సెస్ ఫార్ములా ఇదేనంటూ, ఇప్పుడు టాలీవుడ్ కూడ అదే ఫాలో అవుతోందని చెప్తున్నారు సినీ పండితులు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more